వయసు తో సంబంధం లేకుండా ప్రియుని తలపు మనసులోకి వచ్చినప్పుడు ప్రతి ఆడమనసు ఈ పాటే పాడుకుంటుందేమో అనిపించింది. మనకి ఇంకా యెక్సపీరియన్సు లెదు కాని,ఇంత మంచి పాటని ఆస్వాదించకుండా ఉండలేకపోయాను.
నాకు తెలిసిన ప్రేమికుల రోజు,అమ్మ నన్నల రోజు,మంచి రోజు 26 ఆగష్టు ఎ కాబట్టి ఈ పాటకి ఆ పేరు పెట్టుకున్నాను.
(పాట నేను రాసాను అనుకునేరు!స్వయంవరం చిత్రం నుండి ...ఎత్తి రాసిందే ;)
"మరల తెలుపనా ప్రియా..మరల తెలుపనా ..
ఎదలోయల దాచుకున్న మధురోహల పరిమళాన్ని
కనుపాపలు నింపుకున్న చిరునవ్వుల పరిచయాన్ని
మరల తెలుపనా ...ప్రియా మరల తెలుపనా
విరబూసిన వెన్నెలలో తెరతీసిన బిడియాలని..
ఆణువణువూ అల్లుకున్న అంతులేని విరహాలని
నిదురపోని కన్నులలో పవళించు ఆశలని
చెప్పలేక ,చేతకాక..మనసుపడే తడబాటుని
మరల తెలుపనా ...ప్రియా..మరల తెలుపనా
నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయచుసి
మాటరాని మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయే
ఒక క్షణమే ఆవేదన..మరుక్షణమే ఆరాధన
తెలియరాక తెలుపలేక..మనసు పడె మధుర బాధ
మరల తెలుపనా ప్రియా..మరల తెలుపనా ...
5, డిసెంబర్ 2009, శనివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి