19, డిసెంబర్ 2009, శనివారం

బుజ్జి కోరికలు

చిన్నప్పటినుండి నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయ్.కొన్ని పనులు చెయ్యాలని,కొన్ని ప్రదేశాలు చూడాలని,చిన్నా పెద్దా కోరికల లిస్టు ఉందిలే.పురావస్తు తవ్వకాల్లో బయట పడ్డట్టు,ఈ మధ్యనే నా చాంతాడు కోరికల చిట్టా బయటపడింది. Bucket List అనే సినిమా చూసి,సావకాశంగా అర్ధరాత్రి ఆలోచించి ఇక్కడ పొందుపర్చుకుంటున్నాను.

మరీ చిన్నప్పుడు లిల్లిపుట్లు దొరికితే బాగుండు అని మా పెరట్లో వెతకటం,మా తోటలో గులాబీల చేత ఎలాగైనా మాట్లాడించాలి అనుకోవటం,హిట్లర్ గురించి చదివి నేనూ కూడా ఒక నియంత గా మారి ఒక సామ్రాజ్యం స్థాపించాలి ఆకోవటంలాంటివన్నీ మామూలే.
ఫిజిక్స్ చదువుకునేప్పుడు,మేటర్,యనర్జి ఒకదానిలోకి ఒకటి మార్చచ్చు అని తెలుసుకుని,ఆ అంశం మీద ఒక నవల రాసేద్దాం అని బయల్దేరా.ఆ మాటే ఇంట్లో చెప్తే,ఫిజిక్స్ లో మర్కులు తగ్గుతున్నాయ్,బుద్ధిగా చదువుకొమ్మని నెత్తిన ఒక మొట్టికాయ పడింది.స్కూల్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద శాస్త్రవేత్తల పేర్లు అంత క్లిష్టంగా ఎందుకుంటాయో అర్ధమయ్యేది కాదు.నేనూ ఎప్పటికైనా ఏదైనా మంచి ఆవిష్కరణ చెయ్యాలి అనే కోరిక ఉన్నా,నా పేరు గుర్తుపెట్టుకోలేక పిల్లలు సతమతమవుతారని మానుకున్నాను.


కూని రాగాలు బాగా తీస్తున్నానని నాకు సంగీతం నేర్పబోతే,ఒక్క ఏడాదికల్లా,సాహిత్యాభిలాష ఎక్కువయ్యి,పాటలు వింటూ,నేనూ పాడటం మానేశా.అదే సమయంలో తాళం మీదకి మనసు మళ్ళి,సంగీతం వొద్దులే,నృత్యం నేర్చుకుంటాను అని ఎగిరాను. కుచపూడి నేర్చుకుందాం అనే మొదలెట్టాను.ఆరు నెలల తరువాత,కళలు కూడు పెట్టవురా,సదువుకో అని బలవంతం చేసి నన్ను హాస్టల్ లో పడేసి డాక్టర్ ని చేసేసారు.అందుకే మెడిసిన్ ఐపోయాక మళ్ళి ఒక డాన్స్ టీచర్ ని కలిసా.వైద్యం మానేసి,బుద్ధిగా రోజూ వచ్చి నేర్చుకుంటా అని మాట ఇవ్వమన్నది ఆవిడ.మళ్ళి ఇటూ వస్తే నీ మీద ఒట్టు అని మాట ఇచ్చేసి పారిపోయా.

ఘంటసాలగారిని,రాఫిగారిని,వారి పాటలు విన్నాక,ఒక్కసారైనా కలవలేకపోయానే అని చాలా బాధ పడ్డాను.నేనూ కాస్త ముందు పుట్టాల్సింది,లేదా వారు కాస్త ఆలస్యంగా గతించాల్సింది.మా టైమింగ్ మ్యాచ్ కాలేదులే.
చందమామ అంటే చాలా ఇష్టం నాకు.ఒక్కసారైనా ఆ చంద్రమండలం మీద కాలు మోపాలని ఒక కోరిక.నేనూ ఊహించిన కలల ప్రపంచంలా ఉండదని తెలుసు.ఐనా అవకాసం వస్తే నీలాల నింగి మెరిసిపడే నిండు చంద్రుడిని తాకాలనే కోరిక ఇంకా ఉంది.

ఒకప్పుడు భూమికి అవతలివైపు ఏముందో తెలుసుకోవాలనే కోరికతో,మా కారు గారేజీ లో తవ్వటం మొదలెట్టా.అది కూడా ఒక చిన్న పుల్లతో.అసలు అలా ఒక్క మూడు నెలలు తవ్వేసుకుంటూ పొతే నా కల సాకారం అవుతుందనే గట్టి నమ్మకం నాకు. కానీ ఈ లోపు వర్షాలు పడి,తవ్విన మూడు సెంటిమీటర్లు పూడుకుపోయింది.మళ్ళి అటూ వెళ్ళలేదు నేనూ.
సప్తర్షి మండలం లో ఒక నక్షత్రం రాలిపోతే చూడాలని ఒక కోరిక.ఇదేం వెర్రి కోరిక అని అడగద్దు.నాకెందుకో నక్షత్రాలు కూడా అశాశ్వతం అని తెలుసుకున్నప్పటి నుండి ఈ ఆలోచన ఎక్కువైయ్యింది.మరి నేనుండగా అది చూస్తానో లేక ఇంకో జన్మ ఎత్తాలో.

మంచు కొండలంటే నాకు చాలా ఇష్టం.అందులోను హిమాలయాలు అంటే చెప్పలేని మమకారం.గుంపుతో కాదు..ఒక్కదాన్నే వెళ్లి ఆ హిమరాజంతో ఊసులాడాలి.అక్కడ నిశ్శబ్దం వినాలి.త్వరలో సాకారం చేస్కోవాలి.అలాగే మానస సరోవరం కూడా చూసి రావాలి.అండమాను లో ప్రక్రుతి సౌందర్యం గురించి విన్నాను.షిప్పు లో వెళ్తే ఆ అందం ద్విగుణీకృతం అవుతుందట.కాబట్టి నా చిట్టాలో చేర్చేసాను.సముద్రగర్భం చూడాలని కూడా ఒక కోరిక.Into the deep.ఆ మంచు కొండైన ఈ సాగరగర్భమైనా యెంత ప్రశాంతంగా ఉంటాయో చుడాలిమరి.

నిండు పున్నమి వెన్నెల్లో,కాలికింద ఇసుకతెన్నెలు,అలా అలా పలకరించే అలలున్న సముద్రతీరం,మబ్బుల ముసుగు,పిల్లగాలి వీచే వేళ ఒక రేయి అంతా నిసితారలతో ముచ్చటించాలి అని కూడా కోరిక.నా మనసుకి నచ్చిన అలాంటి ప్రదేశం దొరకగానే ఆ కోరిక కూడా తీరుతుంది.ఆలోపు ఎత్తైన బాల్కానీలో నవ్వారు మంచం వేస్కుని,లైట్లు వేసాక సిటీ సొగసు,పౌర్ణమి నాటి చందమామ ముద్దుమోమును చుస్తూ,నచ్చిన పాత పాటలు వింటూ,హాట్ చాక్లెట్ తాగుతూ...
నవ్వకండి మరి! ఈ పని భారతదేశంలో మా స్వగ్రుహమునందు చేసితిమి.మరీ ఈ దేశం చలికి గడ్డ కడితే పట్టికెళ్ళి పొయ్యిమీద పెట్టేవాళ్ళు కూడా లేరు.అందుకే వేసవి వచ్చేదాకా ఆగుదాం అనుకుంటున్నాను.ఎప్పుడన్నా మీరు కూడా ప్రయత్నించండి.చాలా హాయిగా ఉంటుంది.

నేనూ ఏదేదో అనుకున్నా కానీ,మరీ పెద్ద చిట్టా ఎం లేదేంటి!ఇవాల్టికి  ఇవాళ ఆలోచించినా సంతృప్తిగానే ఉంది.అందుకే నా అసలు కోరిక,జీవితాంతం నిండుగా,తృప్తిగా,సంపూర్ణమైన సంతోషంతో బ్రతకటమే.

9, డిసెంబర్ 2009, బుధవారం

కలయా..నిజమా..మైమరపా

చుట్టూ అందమైన కొండలు,వాటిపై సిసిరానికి సిగ్గుపడి ఎర్రబడుతున్న చెట్లూ.చెట్ల పై ఆటలాడుతున్న ఉడుతలు,పాటలు పాడుతున్న పక్షులు.తనువులో ప్రతి అణువూ పులకించే చలి.మబ్బుల నీడలో వెచ్చని నీరెండ వేడిమి.మధ్యలో నిశ్చలమైన నీటి కొలను.ఆ నీలాకాశం తన ప్రతిబింబాన్ని చూసి మురిసిపోయే స్వచ్చమైన నీరు.అందులో ఒక ముచ్చట గొలిపే హంసల జంట.ఒకరిని వీడి ఒకరు ఉండలేనట్టు మెడలు పెనవేసుకుని.వాటిని చూసి ఈర్ష్యపడి అదోలా చూస్తున్న నీటి పక్షులు. గాలి వీచినప్పుడు ఆకుల సరిగమలు తప్ప నిశ్శబ్దం....

కల కాక మరేమిటి అంటారా?కాదు సుమా..నిజమే.

లేక్ ఒంటారియో(Lake Ontario)దాగ్గర ఒక పార్కుని అనుకోకుండా దర్శించే భాగ్యం కలిగింది మొన్న.నన్ను నేను మర్చిపోయి చాలా సార్లు ప్రక్రుతిలో లీనమయ్యాను కానీ,ఆ క్షణాన కలిగిన మైమరుపు..;ఒంటరితనం లో కూడా ఇంత హాయి ఉంటుందా!

ఇక్కడ చెట్లు ఆకులు రాల్చటం మొదలెట్టక ముందు రంగులు మారుస్తాయి.ప్రతి చెట్టూ ప్రక్రుతితో తనకున్న సంబందాన్ని నచ్చిన రంగుతో తెలుపుతుంది.పచ్చని వన్నె నచ్చి విప్పారిన ఆకులతో స్వాగతం చెప్పే చెట్లూ కొన్నైతే,కెంపులో పండుటాకులో అర్ధం కాకుండా ఆశ్చర్యపరచేవి కొన్ని.కొన్ని చెట్లూ మరీ మితిమీరి ఒక్కో ఆకునీ ఒక్కో రంగులోకి మార్చి,పురి విప్పి కదలని నెమళ్ళు అవుతాయి.ఆ చెట్ల అందాలని(fall colours)చూడాలే కానీ,వర్ణించ తరమా..ఋతువు మార్పులో ఇంతటి మధురిమ నేను ఎన్నడు చూడలేదు.

అలాంటి కాలంలో అనుకోకుండా ఆ నీటి కొలను దగ్గరికి వెళ్ళాం.వెచ్చని కోట్లు దాగ్గర లేక చలి చలి..కానీ ఆ కదలిక లేని నీటిని చూసి కదలలేకపోయాను.చెట్ల మద్యనుండి నడిచి వెళ్తే,నీటి మధ్యలో ఒక చెక్క బ్రిడ్జి(board walk).నా మనసుని ఆకర్షించిన అయస్కాంతం అదే....

రెండు హంసలు..పాల నురుగా,పత్తి పువ్వులా అన్నట్టు వాటి సుతిమెత్తని రెక్కలు.ఆ జంట కదలికకి పులకించి అంతటి నిస్చలమైన నీటిలో కూడా చిన్న అలజడి.మెడలు పెనవేసుకుంటూ,విడిపోయి ఓలలాడుతూ,అటూ ఇటూ తిరుగాడుతూ,వాటి లోకం లో అవి...ఏదో కలల లోకంలో నేను.చుట్టూ ఇంకెవరు లేనట్టు తెలియని ఒంటరితనం.కానీ ప్రక్రుతి లో నేనా..నేనే ఆ ప్రక్రుతా అని అర్ధంకాని సంశయ స్థితి.కాసేపు అసలు నేను ఉన్నానో లేనో,ఏదీ తెలియని లోకం.నిజంగా లీనమైపోయాను సమయంలో... ప్రకృతిలో...నాలో....

కెమెరా తీసుకెళ్లటం మర్చిపోయినా,ఆ దృశ్యాలని కాంచిన నా కన్నులదే కదా అదృష్టం.ఆ అనుభూతిని చేజిక్కిన్చుకున్న నా మనసుదే కదా తన్మయత్వం.ప్రక్రుతి అందం సాటిలేనిది.మళ్ళి అందాల లోకం లో నాకు నచ్చిన వర్నింపు తో వస్తా..అందాకా మీ చుట్టూ ఉన్న అందాన్ని ఆస్వాదించండి. :)

కుడి ఎడమైతే పొరపాటు లేదోయి..

కాదుకాదు...పాట గురించి ఇక్కడ చెప్పటం లేదూ.బుజ్జి ఎడమ చేతి వాటం గురించి ప్రస్తావన వచ్చింది నిన్న.ఆగష్టు పదమూడు (13th) ప్రపంచ ఎడమచేతి వాడుక ప్రజల దినోత్సవం అని వినీ,నన్ను ఈ లెఫ్ట్ హండర్ర్స్ వాళ్ళ జట్టులో కలుపుకుంటారో లేదో అనే అనుమానంతో పాటు,నా పాత జ్ఞాపకాలు పంచుకుందాం అనే ఆవేశంతో అర్ధరాత్రి సీరియస్గా టైపు కొట్టేస్తున్నను.

చిన్నప్పుడు,అంటే నేను పుట్టిన కొత్తల్లో,ఎడమ చేతి బోటని వేలు,ఇంకాస్త పెద్దయ్యాక ఎడమ కాలి బోటని వేలు నోట్లో వేసి జుబుకూ జుబుకూ చీకేస్తుంటే,అదేదో పసిపిల్ల చెష్ఠ అని మురిసి ముద్దు చేసారట మా వాళ్ళు.ఇంకొన్ని నెలలు గడిచి ఉయ్యాల్లో ఆడుకునేప్పుడు,దగ్గరకొచ్చి పలకరించే అందరి జుట్టు ఎడమ చేతితో గట్టిగా పీకేస్తుంటే,పసిది భలే చిలిపిది అనుకున్నారు కానీ,అక్కడ మన ఎడమ చేతి వాటం గుర్తించలేదు.

ఒకసారి ఆమ్మ వేరుసెనగ పచ్చడి రోట్లో రుబ్బి,ఒక గిన్నెకి సర్ది,రోలు కడుగుదాం అని అలా పక్కకి వెళ్ళే సరికి,అప్పుడప్పుడే బండాడటం నేర్చుకున్న నేను ఆ పచ్చడి గిన్నె దగ్గరికి చేరానాట.అమ్మ వెనక్కొచ్చి చూసేసరికి గిన్నె ఖాళీ.నా ఎడమ చేతి చిటికిన వేలుకి అంటుకున్న కాస్త పచ్చడి చూస్తే తప్ప క్రైమ్ సీన్ లో నా పాత్ర ఏంటో తెలియలా.సరే,పచ్చడి సంగతి పక్కన పెడితే నేను ఆరగించింది ఎడమచేత్తో అని అమ్మకి చూచాయిగా అర్ధం అయిందట.చేతిలో పప్పులు పెట్టమని అడగాలంటే ఎడమ చెయ్యి,అక్క మీద కోపం వస్తే,ఎడమ చేతిలో ఉన్న వస్తువులు విసిరేయ్యతమే.పుస్తకం లో వ్రాయమంటే ఎడమ చేత్తో కోడిగేలికినట్టు అక్షరాలూ.పెన్సిల్ చెక్కటం దగ్గరనుండి,బొట్టూ పెట్టుకోవటం,తల దువ్వటం,గరిట తిప్పటం దాకా,అన్ని ఎడమ చెయ్యే.

పాత సినిమాల్లో సూర్యకాంతం లాగా పుర్ర చేత్తో అడ్డం వచ్చిన వారిని చరుస్తూ,ప్రసాదం కోసం కూడా పుర్రచెయ్యేన్టిరా సన్నాసి అని తిట్లు తింటూ,ఆడుకుంటూ పాడుకుంటూ ఉండె నా చిన్నా జీవితానికి ఒక వెర్రి వెంగళప్ప ఉచిత సలహా వల్ల పెద్ద ట్విస్ట్ ఎ వచ్చింది.ఎడమ చెయ్యి ఎక్కువ వాడే పిల్లల మేధస్సు దెబ్బతింటుందని ఆయన చెప్పటం,ఆ మాట నమ్మిన మా జనం నన్ను బతిమాలి,బామాలి,ఎడమ నుండి కుడికి మర్పించాలని ప్రయత్నించటం జరిగిపోయాయి.

పుట్టుకతో వచ్చిన బుద్ధి కదా,మారాను అని భీష్మించుకుని కూర్చున్నాను.ఇరు వర్గాల వాదోపవాదాల అనంతరం,రాయటం,తినత వరకు కుడి చెయ్యి.మిగతా పనులు ఎడమ చెయ్యి అయినా పర్లేదు అనే సామరస్యమైన ఒప్పందం కుదిరింది.కుడి చేత్తో కూడా ఎడమచేత్తో రాసినంత అసహ్యంగా రాయగలను అని గమనించి,తప్పకుండా డాక్టర్ని అయిపోతా అని ముందే ఊహించారు లెండి.కుడి చేత్తో అన్నం కలుపుకోవటం రాక,అసలుకే తిండి తినటం మానేసా కొద్ది రోజులు.అందుకని అమ్మ వండిన అన్ని రకాలు కలిపి నా చిన్నా ప్లేట్ లో పేర్చి ఇస్తే,ప్లేట్ ని రౌండ్ గా తిప్పుకుంటూ,స్పూన్ తో గతికేదాన్ని.నచ్చని అన్నం,స్టాండ్ లాగా పేర్చి, దానిమీద ప్లేట్ పెట్టేస్తే,ఎవరు కనిపెట్టలేరు అని కూడా అనుకునేదాన్నిలే.

రెండు చేతులు సవ్యసాచి లాగా వాడేయ్యటానికి అలవాటుపడ్డ నాకు,ఫైనల్ ఇయర్ ప్రక్టికల్ పరీక్షల్లో అసలు కష్టం తెలిసొచ్చింది. మాములుగా పేషెంట్ ని కుడి చేతి వైపు నిలబడి పరీక్షిస్తారు.నేను నాకు వీలుగా ఉన్న వైపు నుండి ఒక పెద్దాయన కాలి కీలుని సుత్తి తో చితక్కోడుతుంటే,ఎగ్జామినర్ వచ్చి..ఎమమ్మాయి..ఏ చెయ్యి వాడుతున్నావ్ అని గుడ్లురిమారు.(అంటే knee joint ని knee hammer తో చితక్కోడ్తున్నా అని అర్ధం.)అదేదో ఘోరాపరాధం లాగా నా మార్కులు కోసేయ్యబోయి,అదృష్టం కొద్ది,ఎమ్ బంగారూ..లెఫ్ట్ హండర్ వా నువ్వు అని అడిగారు.మన ఘన జీవితచరిత్ర ఆయనకెందుకులే అని క్లుప్తంగా "యా"  అన్నాను.కానీ,ఆన్సర్ షీట్ లో మాత్రం బరబరా కుడిచేత్తో గీకేస్తుంటే,స్థంభం చాటున దాక్కుని చూస్తున్న ఆయనకి ఇక్కడేదో కుట్ర జరుగుతుందని అనుమానం వచ్చింది.

కాసేపు వైవా బదులు నా లెఫ్ట్ handedness మీద ఇంటరాగేషన్ సాగింది.నేను మళ్ళి విక్రమార్కుడికి భేతాలుడు చెప్పినట్టు నా కధ అంతా వివరించి,ఈ సారి క్లుప్తంగా కాకుండా,"I am a Right hander with preference to Left and Left hander with preference to Right.Rather,call me ambidexterous"అని అస్సలు అర్ధ కాకుండా చెప్తే కానీ ఆయనకి అర్ధ కాల.ఆయన నమ్మటం,పాస్ అయ్యే అన్ని మార్కులు వేసి నన్ను కాలేజీ నుండి సక్సెస్ఫుల్ గా తన్నేయ్యటం జరిగాయి. తేడా జరిగుంటే ఈ పాటికి నా హాస్యకదా చిత్రం మంచి ట్రాజెడీ సినిమా అయ్యేది.

చిన్నా పిల్లలు చేతకాకుండా ఎడమ చేత్తిలో స్పూన్ పట్టుకుని తినటానికి తంటాలు పడుతుంటే,నాకు భలే నవ్వొస్తుంది.వేళ్ళల్లో ఎందరు నాతో పాటు కుడి ఎడమైతే పొరపాటు లెదొఇ అని పాడుకుంటారో అని.ఇంతకి మీరు ఏ పాట పాడుతున్నారు? :)

8, డిసెంబర్ 2009, మంగళవారం

చిన్ననాటి కబుర్లు

ఇవాళ పిచ్చాపాటీ మాట్లాడుకుంటుంటే,కోడి గుడ్డు ఖరీదు యెంత అనే ప్రశ్న తలెత్తింది.అలా అలా మాటల ప్రవాహం లో కొట్టుకుపోయి,నా చిన్నప్పుడు ఐతే కొన్ని పైసలకే వచ్చేది గుడ్డు,ఆ కాలమే వేరు అని డైలాగు కొట్టాను కానీ,నా కళ్ళ ముందు పాత సినిమా ఫ్లాష్ బ్యాక్ లాగా కొన్ని చక్రాలు తిరిగాయి.

చిన్నప్పుడు మా ఇంట్లో ఒక బ్లూ కలర్ ఎగ్ కేసు ఉండేది.అంటే ఆ ప్లాస్టిక్ డబ్బాకి ఇంకేమన్నా పేరు ఉన్దేమో కానీ,నేను దాన్ని ఎగ్గుపెట్టే అనే పిలిచేదాన్ని.గుడ్డు ఆకారంలో ఆరు ఖాళీలు ఉంటాయ్ దానికి.షాప్ కి వెళ్లి గుడ్లు తెచ్చే ప్రతిసారి నాకు దాని హన్డెల్ పట్టుకుని గట్టిగా ఊపుకుంటూ ఇంటికి రావాలని బలమైన కోరిక ఉండేది.చిన్నపిల్లనని నా చేతికి అస్సలు ఇచ్చేవారు కాదు ఆ పెట్టెని.నేను మరీ ఏడ్చి గీపెడితే,ఆరు నూరైనా సరే,నేను దాన్ని గాల్లో ఝండా లాగా ఊపను అని సవాలక్ష ప్రోమిస్లు తీస్కుని, ఒక్కసారి అపురూపంగా నా చిట్టి చేతుల్లో పెట్టేవారు.ఇప్పటికి నాకు తీరని కోరికగా మిగిలిపోయిన విషయాల్లో ఇది ఫస్ట్ ఆన్ ది లిస్టు.

ఇహ రోజూ సాయంత్రం పాల ప్రహసనం.అమ్మ మాకు హార్లిక్స్ కలిపిన పాలు ఇచ్చేది.నాకు హార్లిక్స్ తినటం మాత్రమె ఇష్టం. అందుకని ఒక కటోరి నిండా హార్లిక్స్ వేస్కుని తినేసి,వుట్టి పాలు ఒక స్టీల్ గ్లాస్ లో పోయించుకుని బయట తిరుగుతూ ఉండేదాన్ని.యెవరూ చూడకుండా నేను ఒక గుక్క తాగి,ఒక గుక్క మా సన్నజాజి మొక్కకి ఇచ్చేదాన్ని.మొత్తం ఒకేసారి ఒలకబోస్తే చెట్టు మొదట్లో పాలు కనిపిస్తాయి కదా,అదీ మన తెలివి.ఇహ చూస్కోండి..పాల వల్ల నాకు బలమేమో కానీ,మా సన్నజాజి మొక్క మాత్రం బాగా ఏపుగా పెరగటం మొదలెట్టింది.బోలెడు పువ్వులు కూడా.దాని పక్కన ఉన్న మొక్కలు ఈసురోమని వేలాడుతూవుంటే,ఇది మాత్రం నవనవలాడుతూ భలే ఉండేది.కానీ ఎక్కువ రోజులు ఈ అగ్రీమెంట్ సాగలేదు.
ఏదో చిలిపి పని చేసా అని నాకు కటోరి హార్లిక్స్ అల్లోవన్సు కట్ చేసి,పాలల్లో ఒక రెండు స్పూన్లు కలిపి ఇవ్వటం మొదలెట్టింది అమ్మ.అదే చెట్టుకి నేను పాలాభిషేకం చేస్తుంటే,మంచి ఫుడ్ సోర్సు దొరికిందని చీమలు పుట్టలు పెట్టటం మొదలెట్టాయి.మన కధ బయట పడిపోయింది.నాకు దెబ్బలు పడ్డ చాలా కొన్ని సందర్భాలలో ఇది ఒకటి.

దెబ్బల సంగతి ఎలాగో చెప్తున్నా కాబట్టి,ఆ మిగతా సందర్భాలు కూడా చెప్పేస్తే పోయే.ఒక సారి కొత్త బోంబే డయ్యింగ్ బెడ్ షీట్ మా మంచం మీద వేసింది అమ్మ.అది తెల్లగా మల్లెపువ్వు లాగా,తళతళా మెరిసిపోతుంది.ఎం పూనిందో ఏమో,మా అక్కా నేను వాడేసిన బ్లేడు ముక్క చెరో సగం అందుకుని,దాన్ని అడ్డంగా నిలువుగా కోసి పారేసాం.ఆ పని ఎందుకు చేసామో ఇప్పటికీ మాతో సహా ఎవరికీ అంతుపట్టని చిక్కు ప్రశ్న.కానీ చేసిన పని ఒప్పుకుని ఇద్దరం చెరి రెండు దెబ్బలు తినేశాం.

ఇంకో సందర్భ ఏంటంటే,మా ఊరికి వెళ్ళినప్పుడు ఒకసారి నన్ను "తెల్లసుబ్బి"అని అందరు ఏడిపించారు.అందరూ అంటే బాధ లేదూ కానీ,మా అక్కకుడా వంత పాడేసరికి బాగా కోపం వచ్చేసింది.పట్టుకుని కొడదాం అంటే నాకు చిక్కకుండా పరిగేడ్తుంది.
ఇంక ఉక్రోషం ఆపుకోలేక నా ఎడమ కాలి హవాయి స్లిప్పేర్ తీసి విసిరేసా.అసలే నా స్లిప్పేర్ సైజు చిన్నది.పైగా నా టైమింగ్ ఏంటో కానీ,అది టార్గెట్ మిస్ అయ్యి,ఎదురుగ్గా మజ్జిగన్నం తింటున్న మా కజిన్ ప్లేట్లో కరెక్ట్ గా ఫిక్స్ అయ్యింది.యేమి జరిగిందో తెలుసుకునే లోపు ఈ సీన్ మొత్తం అప్పుడే ఇంట్లోకి ఎంటర్ అవుతున్న నాన్నారు చూసేసారు.నేను జరిగిన విషయ కంటే జరగబోయే పరిణామం ఊహించుకుని బిక్కచచ్చిపోయి నిల్చున్న.ఇంక చెప్పేదేముంది...కాకపొతే నా ఆవేశానికి కూడా కారణం ఉందని సహృదయ తో అర్ధ చేస్కుని,నాకు రెండు తగిలించి,మా అక్కకి కూడా ఒక రెండు తగిలించారు.లెక్ఖ సరిపోయింది. :)

ఇహ ఒకసారి మా ఇంటికి బీరకాయ పీసు చుట్టాలు వచ్చారు.వాళ్ళు మాకు ఏమవుతారో నాకు తెలియదు.అసలే ఆదివారం.నేను నా ఆటల్లో మునిగిపోయి ఉంటె,ఈ చుట్టాలకి టిఫిన్ వడ్డించాలి అని నన్ను పిలిచారు.అమ్మ వేడిగా పూరీలు వేస్తూ,వాళ్లకి పెట్టిరమ్మని పంపింది.రెండు సార్లు టేబుల్ చుట్టూ తిరిగి,ఇంకొన్ని తినండి అంకుల్ అని నేను అనటం,వాళ్ళు తెగ మోహమాట పడుతూనే,నేను అన్నా తత్క్షణమే,ఇంకో నాలుగు పూరీలు తినటం.ఏమో..చిరాకు అనిపించిందో ఏమో మరి,మూడో సారి టేబుల్ దగ్గరికి వెళ్లి...ఇదిగోండి,ఆ తినేదేదో మొహమాట పడకుండా తినేసేయ్యండి.మాటిమాటికీ వచ్చి మిమ్మల్ని బ్రతిమాల్లెను బాబూ అనేసా!పాపం తెరిసిన నోరు అలాగే ఉంచి నా వైపు చూసి,ఇంకో రెండు పూరీలతో క్లుప్తంగా ముగించేసారు.ఆ తర్వాత ఇంకెప్పుడు వాళ్ళని చుసిన గుర్తు లేదూ మరి.

అమ్మ నా మోహానికి దోసగింజ ఆకారంలో బొట్టు పెట్టి,ఇంత పెద్ద బొట్టు ఎందుకు పెట్టావమ్మా అని అడిగితె,అప్పుడు మోహం పద్మం లాగా ఉంటుందిరా నాన్నా అనేది.అందుకని అమ్మని మాటిమాటికి పద్మం బొట్టు పెట్టావా అని గోల చేసి,సొంతంగా పెట్టుకోవటం ప్రాక్టీసు చేసేదాన్ని.మా ఇంట్లో ఒక డ్రెస్సింగ్ టేబుల్ ఉంది.నేను పుట్టినప్పుడు కొన్నరేమో మరి,అదంటే నాకు ఎక్కడ లేని ఫాసినేషను.ఎక్కడ ఏ పని చేస్తున్నా ప్రతి గంటకీ నేను ఆ అద్దం ముందు ప్రత్యక్షం అయ్యి,దువ్విన తలే మళ్ళి దువ్వి, రకరకాల అంకాళమ్మ బొట్లు పెట్టి,వాటిని తుడిచేసి ఈ అద్దం రెండువైపులకి పుసేసేదాన్ని.ఇప్పటికీ ఆ బొట్టూ కాటుక అవశేషాలు ఆ అద్దానికి అలంకారాలుగా మిగిలి కనిపిస్తుంటాయి.

అద్దానికి ఈ రకంగా అతుక్కుపోతున్నాను,భయంకరంగా పౌడర్ రాసేసుకుంటున్నాను అని,నాకు తెల్లసుబ్బి అని నామకరణం చేసారు.నాకు అది సరిగ్గా పలకటం రాక,నేనేం తెల్లజుబ్బి కాదు,నువ్వే నల్ల జుబ్బి,దొంగమున్న అని తిట్టిపోసేదాన్ని.అసలు ఎక్కడ ఉంటె అక్కడి మాండలికాల్లో మాట్లాడేస్తున్నాను అని,విశేషంగా కొత్త పదాలు ప్రయోగిస్తున్నాను(బూతులు)అని,రెండో తరగతి లో ఆంగ్లం మాత్రమే మాట్లాడే మంచి స్కూల్లో పడేసారు నన్ను.అయినా పెద్దగా మారినట్టు లేను నేను :)

స్కూల్ నుండి ఇంటికోచ్చేప్పుడు,పాపం మా అక్క నా టిఫిన్ బుట్ట,తన టిఫిన్ బ్యాగు,తన స్కూల్ బ్యాగు,నా స్కూల్ బ్యాగు,ఇంకా తన వాటర్ బాటిల్ మోసుకొచ్చేది.నేను నా ఒక్క వాటర్ బాటిల్ ఊపుకుంటూ,పాటలు పాడుకుంటూ తెచ్చుకునేదాన్ని.నా దృష్టిలో చేతిలో ఒక పుస్తకం ఉంటె వాళ్ళు స్టైల్ గా ఉండె కాలేజీ పిల్లలు.ఏదో దిక్కుమాలిన సినిమా లో చూసాను మరి. అందుకే సామాను మొత్తం అక్క చేత మోయించి,నేను తన టెక్స్ట్ బుక్ ఏదన్నా అలా అలవోకగా పట్టుకునేదాన్ని.పెద్ద క్లాసు టెక్స్ట్ బుక్ ఐతే నేను పెద్ద క్లాసు లో చదువుతున్నాను అనుకుంటారని వెర్రి ఆశ.చిన్నవయసులో మనకి పెద్దరిక ఆపాదిస్తే బాగుండు అని అందరికి అనిపిస్తుంది ఏమో మరి.ఇంతకి అప్పుడు నేను రెండో తరగతి,మా వాడు మూడు.:))

మా ఇద్దరికీ ఒక్క క్లాసు మాత్రమె తేడా కాబట్టి లాజికల్ గా తన పుస్తకాలు నాకు వారసత్వం గా వచ్చేవి.అసలే నా చేతికి వచ్చేప్పటికి అవి సిదిలావస్త లో ఉండేవి.మనకేమో అసలే ఎక్కాలు,లేక్ఖలు రావు.అందుకని మిగతా టెక్స్ట్ బుక్స్ అన్ని బాగా అతికించుకుని,ఒక్క లేక్ఖల పుస్తకంలో మాత్రం నాకు రాని లెక్కలు ఉన్న పేజిలు చింపేసేదాన్ని.ఆ చాప్టర్ లో హోంవర్క ఇచ్చినా,నన్ను చదవమన్నా,దానికి పేజిలు లేవు,అక్క చిమ్పెసింది అని చెప్పి తప్పించుకోవాలని చూసేదాన్ని.పాపం మా వాడు నన్ను యేమి అనేవాడు కాదు..కానీ నాకు ఒక్క లెక్కల కి మాత్రం కొత్త పుస్తకం కొనివ్వటం మొదలెట్టారు మా వాళ్ళు.

ఒకసారి ఆ ఇంట్లో బాగా బంతి పువ్వులు పూసాయి.చాలా బాగున్నాయ్.పువ్వులు వేస్ట్ అయిపోతున్నాయ్ అని వాటిని కోసుకొచ్చి,వాటితో నాకూ,అక్కకి పూలజడ వెయ్యమని ఒకటే గోల.మరీ బంతిపువ్వులతో పూలజడ ఏంట్రా అన్నాసరే వినకుండా, పట్టుపట్టి వేయించుకున్నా.పైగా ఆ జడకి కింద వెండి జడగంటలు.మా కాలనీలో ఉండె కొందరికి చూపిద్దాం అని రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటే చూడాలి ఆ సొగసూ..నిజంగా మా పూలజడ చాలా బాగుంది అని మనసులో గట్టి నమ్మకం మరి!వాళ్ళు అప్పుడు మొదలెట్టిన నవ్వు ఇప్పటికీ ఆపలేదు.నన్ను చూసినా,నా పేరు తలుచుకున్న వారందరూ పగలబడి నవ్వాల్సిందే.

ఇలాంటి కధలు నన్ను కదిలిస్తే నిర్విరామంగా శతసహస్రాలు బయటపడతాయి.కానీ ఇంకెప్పుడన్నా తీరికగా మళ్ళి చెప్తాలే.టాటా టిల్ తేన.

బుజ్జి తంటాలు

అవును మరి,బుజ్జి అనే పేరు పెట్టుకుని ఈ ప్రపంచం లో నెగ్గుకురావటం యెంత కష్టమో మీకేం తెలుసు.ఆ..తెలిసే  ఉంటుంది లెండి.మన ఆంద్ర రాష్ట్రం లో నూటికి డెబ్భై మంది ముద్దు పేరు బుజ్జే గా మరి.ఇది చదువుతున్న మీలో ఎందరు బుజ్జి నామ భాదితులో కదా(బా కి వొత్తు భా).ఇంక మిగిలిన వారికి బుల్లి,చిట్టి,లలలి,బల్లి అని ఏ పేరు పెట్టినా,బుజ్జి ప్రత్యేకత బుజ్జిదే

నిజం.ఎక్కడైనా సెంటర్ లో కుర్చుని బుజ్జీ అని గతిగా పిలిచి చుడండి.వెనువెంటనే మీ పక్కనుండి ఓ..య్ అని కేక వినిపిస్తుంది. అసలు బుజ్జి అని పిలిపించుకోవటానికి ఆకారం తో పనేముంది.మనం మొహం చూసి వీడు హిట్లేర్ బామ్మర్దేమో అని అపోహ పడె వాడి దగ్గరనుండి,ఆజానుబాహువు,బుర్ర మీసాలు,గళ్ళ చొక్కా,పులిపిరి కాయ తో సహా అన్ని హంగులు ఉన్న వస్తాదు దాక ఎవరైనా "బుజ్జీ"" అయుండొచ్చు.అప్పుడే పుట్టిన పసి పాప ని చూసి బుజ్జిది భలే ఉందే అంటారు..పక్కనే ఉన్న చెట్టంత నన్ను చూసి కూడా ఎం బుజ్జి బాగున్నావా అంటారు.అసలు బుజ్జి అమ్మమ్మ,బుజ్జి పిన్ని,బుజ్జి మామయ్యా,బుజ్జి బాబాయి..ఇలా ప్రతి ఇంట్లో ఒకటి రెండు బుజ్జులు ఉంటాయ్ అంటే అతిశయోక్తి కాదేమో.

ఇంతకి ఇవాళ ఈ బుజ్జి గోల ఏంటి అనేనా సందేహం?అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలు ఇలా తన్నుకొచ్చి బ్లాగెక్కి అరుస్తాయి... అందుకని.

మొన్నీమధ్య ఒక పెళ్ళికి వెళ్ళనా.అక్కడ మా దూరపు బంధువు ఒకావిడ ఒక అరకిలోమీటర్ దూరం లో కుర్చుని కనిపించింది.లేచి దగ్గరకి వెళ్ళటం బద్ధకం వేసి,మరీ పలకరించకపోతే బాగోదేమో అని,అలా అలవోకగా తల తిప్పి సైగ చేసి,ఒక చిరునవ్వు కానుకగా పడేసా.అది యెంత పెద్ద తప్పో వెనువెంటనే సమాధానం లో వచ్చిన "బుజ్జి.....జీ" అనే కేక తో నాకు అర్ధం అయిపొయింది.ఆ పిలుపుకి నా ఆకారానికి సరిపోవటం లేదని నేను మొత్తుకున్నా వినరు కదా.చుట్టూ ఉన్న జనం కళ్ళు గప్పి ఆ బుజ్జి నేను కాదని తప్పించుకునే ప్రయత్నం చేసాను.గాలి తో సంభాషిస్తూ ఎటో చూసాను.

ఆవిడ పట్టు వదలకుండా మా మధ్య ఉన్న జన వారధికి పని అప్పచెప్పింది.తన పక్కన ఉన్నవారికి మా బుజ్జిని పిలవండి అని గుసగుస,వాళ్ళు తమ పక్కనున్న వారితో అదే గుసగుస.నా పక్కన పది నెలల బుజ్జి వాళ్ళ అమ్మ వడిలో ఆడుకుంటుంటే, ఈవిడగారి పిలుపు విని ఎవరో ఆ పిలుపు ఆ పసిదానికోసం అనుకున్నారు కాబోలు,ఏకంగా నా భుజం తట్టి,ఏవండి ఆ బుజ్జి పాప ని అక్కడ ఉన్నావిడ పిలుస్తుందని చెప్పండి అన్నారు.నేను వినపడనట్టు ఇంకేటో చూస్తున్నా పదేపదే అదే మాట.ఇంక ఎక్కువ సేపు తప్పించుకోవటం కుదరదు అని తెలిసిపోయాక ఆ బుజ్జిని నేనే అని ప్రకటించుకుని ఆవిడ ప్రేమావేశం తట్టుకొవటానికి దగ్గరికి వెళ్ళక తప్పలేదు.

ఈ ఒక్క సందర్భమే కాదు.మా చుట్టాల్లో చాలా మందికి నా పేరు బుజ్జి మాత్రమె.ఇంటర్మీడియేట్ కి హాస్టల్ లో ఉన్నప్పుడు మనకి ఒక చిన్నా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది.కాకపొతే మా చుట్టాలు ఎవరికన్నా చెప్పేటప్పుడు మా బుజ్జి మీకూ తెలుసా అని అడగటం.అసలు గంభీరంగా ఉందే ఈ శ్యాల్తి పేరు బుజ్జి అని జనానికి తెలిస్తే..హవ్వా..యెంత అప్రతిష్ట!!

చాలా సార్లు అమ్మ ని వేదిస్తుంటాను.నాకు బుజ్జి అని పేరు యేల పెట్టవలె?పెట్టితివి పో,అదే పేరు తో నన్ను యేల పిలువవలె?పిలిచితివి పో,బంధువర్గ మధ్యమున నన్ను యేల గేలి సేయవలె.యేల బుజ్జి బజ్జి అని పిలువవలె?ఈ పిలుపు విని సమాజము ఊరకుండునా,నవ్వక మిన్నకుండున.ఈ అవమానభారమును భరించి ఊరకుండుటయా?మనుటయా,మార్చుటయా.ఇప్పుడేది
కర్తవ్యము..యెదీ కర్తవ్యము!!!

ఇంకా చదివే ఓపిక ఉంటె మరి కాస్త కధ కూడా ఉంది.చిన్నప్పుడు దూరదర్శన్ లో ఏదో హిందీ సీరియల్ వచ్చేది.అందులో ఒక బుడ్డోడి పేరు చిటుకు.ఈ బుజ్జి కంటే అదేదో బాగుందని ఒక రోజూ పొద్దున్నే ఇహ నుండి నన్ను చిటుకు అని పిలవండి అని శాసనం చేసేసా.పాపం మా వాళ్ళు కూడా ఒక రోజంతా అలాగే పిలిచారు కూడా.నేను కూడా కొత్త పలకరింతకీ పులకరించిపోయా.రెండు ఎపిసోడ్లు అవ్వగానే ఆ చిటుకు కారక్టర్ ఠా!సెంటిమెంటల్ గా ఆ పేరు నచ్చక మా వాళ్ళు ఆ పిలుపు మానుకున్నారు.డామిట్..కధ అడ్డం తిరిగింది.తిరిగి తిరిగి మళ్ళి మొదటికే వచ్చింది.

ఆ తరువాత చిన్నోడా,బుజ్జమ్మ,చిత్తూ ఇత్యాది కూడా నా ప్రమేయం లేకుండా ప్రయోగించారు మా ఇంట్లో.మంచి పేరు వెతుక్కునే విఫల ప్రయత్నం నేను కూడా చేసాను కానీ,చివరకి నాకు అర్ధం అయ్యింది ఏంటంటే ,బుజ్జి అనే పేరు నాకు బంక లాగా బాగా అతికింది.ఇహ ఈ సార్ధక నామధేయముతో నే మనవలె.వేరే ఆప్షన్ లేదూ భాయి:)

P.S. ఏదో ఇంట్లో వాళ్ళని ఉడికించటానికి నాకు బుజ్జి అనే పేరు ఇష్టం లేదని చెప్తుంటా కానీ,ఇంక వేరే ఏ పేరు తో పిలిచినా నన్ను పిలిచినట్టు అనిపించదు.బుజ్జి అంటే బుజ్జే మరి.:)

7, డిసెంబర్ 2009, సోమవారం

మంచు కురిసే వేళలో

నిజంగా ఈ మాటకి అర్ధం ఇవాళే తెలిసింది.నా మొదటి మంచు రోజూ:)
అదే..ఇవాళ మొదటిసారి భారి ఎత్తున మంచు కురవటం చూసాను.నా దేశం నుండి,నా వాళ్ళ నుండి, ఇంతదూరంగా ఉన్న సరే,ఇవాళ ప్రక్రుతి తో చెలిమి చేసి చాలా సంతోషంగా ఉనాను.ఏదో  ఊహించని మలుపుతిరిగి జీవితం అంతా తేటతెల్లం అయిపోయిందని కాదు ఈ సంతోషం.ఇంకా అవే సమాధానం లేని ప్రశ్నలు, అవే సమస్యలు,అవే నిరాశలు,నిట్టూర్పులు, మెల్లిగా మొలకెత్తుతున్న ఆశలు,ఆశయాలు,తప్పక తీరుతాయ్ అనే కోరికలు,అన్నీ అలాగే ఉనాయి.అసలు ఎవడన్నాడు సంతోషంగా ఉండటానికి కారణం కావాలని:)

మంచు పడ్తుంటే వెళ్లి కాసిని ఫ్రెంచ్ ఫ్రాయీస్ తిన్నాను.అగ్నికి ఆజ్యం లాగా నా సంతోషానికి ఇంకా బలం కోసం యాలుకలు దంచేసి పానకం లాగా టీ పెట్టుకుని తాగేశాను.దిల్ ఖుష్!:))
వర్షానికి మంచుకి కాస్త తేడా గమనించాను ఇవాళ.వర్షం పడ్తుంటే చూసారా..ముందు రాజుగారి రాకని సూచిస్తూ నల్లటి పెద్ద పెద్ద మేఘాలు.ధడేల్ మని ఉరుములు.ఆ తర్వాత వెయ్యి వాట్ల బుల్బు వేసినట్టు మెరుపులు.అప్పుడు చిన్నగా మొదలవుతుంది తొలకరి.పెరిగి పెరిగి పెద్ద వాన.మనసులో మకిలి కూడా కొట్టుకుపోయే వాన.స్వచ్చంగా ఉంటుంది వాన వెలిసాక.చెట్లన్నీ పండగకి తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకున్న పిల్లకాయల్లా సంతోషంగా ఉంటాయి..కదా.వర్షం పడేప్పుడు ఆ నెల నుండి వచ్చే సువాసన,అదో కొత్త లోకమే.నిజంగా ఒక్కోసారి వర్షం వెలిసాక గిఫ్ట్ వ్రాప్ తీసిన ప్రజంట్ లాగా అనిపిస్తుంది నాకు లోకమంతా.

ఇంక మంచు పడేప్పుడు ఈ డోలు బాజాలు ఎం లేవు.మెల్లిగా మొదలవుతుంది.తెల్లగా,దూదిపింజలాగా,నిశ్సబ్దంగా.తన రాక మనకి తెలిసేది తలెత్తి చూస్తే మాత్రమె.లేకపోతె అందరిని,అంతటిని తెల్లటి దుప్పటితో కప్పేస్తుంది.మంచు పడుతున్నప్పుడు  చూడటానికి చాలా అందంగా ఉంటుంది.మనసు కూడా ఆ దూదిపింజలతో ఎటో తెలిపోతుంటుంది.తన దారిలో ఉన్న అన్నిటిమీదా తెల్లటి మేలిముసుగు చూడముచ్చటగా ఉంటుంది కూడా.అన్ని చెట్లూ కొత్తగా విరగాపూసిన పత్తి చెట్ల లాగా ఉంటాయి.

చలికాలానికి భయపడి కొన్ని చెట్లూ ముందుగానే ఆకులు రాల్చేస్తాయ్ కదా,కొన్ని చెట్లూ ఎదురు తిరిగి ఇంకా ఆకులు కప్పుకుని ఉన్నాయ్ అని వాటి పని పట్టటానికి వస్తదేమో మంచు.మెల్లిగా వచ్చినా పచ్చటి చెట్లని కూడా తెల్లటి మంచు తో కప్పేస్తుంది. మర్నాటి పొద్దునే పాపం అ చెట్లని చూడాలి.మంచు కరిగాక నల్లగా మాడిపోయి ఉంటాయి.ఇంతందం తనలో దాచుకున్న మంచు ఇంక వికారంగా దేన్నైనా ఎలా మర్చగలదా అనిపిస్తుంది నాకు.అబ్బా..ఏంటో ఇలా రాసుకుంటూ పోతుంటే నాకు నిజంగా మంచు అంటే ఇష్టమో కాదో అని నాకే అనుమానం వస్తుంది.ప్రస్తుతానికి మంచు మానసిక విశ్లేషణ కంటే దాన్ని ఆస్వాదించటం మంచిదేమో.చిన్నప్పటి నుండి కొన్ని కోరికలు ఉన్నాయి నాకు.వాటిల్లో ఒకటి హిమాలయపు అంచులకి వెళ్లి మంచుని చూడాలని.ఇన్నాళ్ళకి మంచుని చూసాను,నేను కోరుకున్న ప్రదేశం లో కాకపూయిన సరే.ఇంకా బుజ్జి కోరికలు ఏంటో తెలుసుకోవాలి అని కుతుహలమా.చెప్తా,చెప్తా.కానీ ఇప్పుడు కాదు.

ఈ పాటికి జనం పాపం మంచుని తెగ తిట్టుకుంటున్నారు.బయటికి వెళ్ళటానికి లేదూ,రేపు రోడ్లన్నీ బురదమయం గా ఉంటాయి అని,ఇంకా చాలా తిట్టుకుంటున్నారు లే.కానీ నాకు సంతోషంగానే ఉంది.ప్రక్రుతి ఏ బట్ట కట్టినా అందమే.ఇన్నాళ్ళు ఆకుపచ్చ చీరలో పెల్లికుతురి లా చూడటం అలవాటైన నాకు ఇవాళ తెల్ల పట్టుపంచె కట్టుకున్న పెళ్ళికొడుకు లా కనిపిస్తుంది/తున్నాడు? :P

మళ్ళి చల్ల చల్లని కబుర్లతో వస్తాలే..టాటా

6, డిసెంబర్ 2009, ఆదివారం

చాక్లెట్ డిప్..వంటలో టిప్

మడిసన్నాక కుసింత కలాపొసన ఉండాలి కదా..మనం తిండి విషయం లో బాగా ప్రయోగిస్తాం లే ఆ పోషణ.

ఫారెన్ నుండి వచ్చిన వాళ్ళు అందరు ముందు తెచ్చేది ఛాక్లేట్లే కదా.మొన్న ఆ బాపతు చాక్లెట్లు బోలెడు ఉన్నాయి ఇంట్లో. చూడటానికి బాగున్నా కొన్ని మాత్రం తొందరగా అయిపోయాయి.ఇహ ఎక్కువగా తినేస్తే మేము కూడా ఆ చాక్లెట్ రంగులోకి మారిపోతాం అని తేలిపోయిన తర్వాత,అంత భీకరంగా చాక్లెట్లు తినే పరంపర కి కొద్ది రోజులు సెలవ ప్రకటించాం.ఏదో ఇటోస్తూ అటు పొతూ ఒకటో రెండో నోట్లో వేస్కోవటం తప్ప,ప్లేట్ నిండా పెట్టుకుని పలహారం చెయ్యటం మానేశాం.ఇహ అప్పుడే వచ్చంది తంటా.వాటిని ఎక్కడ దాచిపెట్టలా అని.ముందు ఒక ప్లాస్టిక్ కవర్ కి అన్నీ వేసి ఫ్రీజేర్ లో పెట్టేశాం కానీ అక్కడ ఆవకాయ జాడీ తో గట్టి పోటి ఎదురవ్వటం తో మళ్లీ ఆ కవర్ ని బయటికి తియ్యక తప్పలేదు.ఎలా మర్చిపోయామో కానీ పాపం ఆ కవర్ మొత్తం కొద్ది రోజులు బయటే ఉండిపోయింది.

ఇవాళ మధ్యానం బాగా తీపి తిందాం అనిపించి ఆ కవర్ గుర్తొచ్చింది.వెంటనే వెళ్లి ఒక పెద్ద..ద చాక్లెట్ ప్యాకెట్ తెరిచి ఒక ముక్క తుంచి నోట్లో వేసుకుందాం అనేది మన ఆలోచన.కవర్ ముట్టుకోగానే ఏదో తేడ గమనించాను కానీ తెరిచాక చాక్లెట్ ముక్క కాదు  కదా,చాక్లెట్ పానకం బయటికి వచ్చింది.పర్యావరణ సంరక్షణ చేయకపోతే వేడెక్కి భూమి బుగ్గైపోద్ది అనే విషయం ఇవాళ ఆ కవర్ తెరవగానే అర్ధం ఐపోయింది.యేమి ఎండలు రా బాబు.

ఇంతకి అలా ఐపోయినందుకు బాధ పడి చేతులు ఊపుకుంటూ వెనక్కి వచ్చేసా అనుకుంటున్నారా ఏంటి? అబ్బే..బుజ్జి గురించి తెలిసినవాళ్లు ఎవరూ అలా అనుకోరు లే.చక్కగా రెండు కటోరీలు తీస్కుని,ఒక పెద్ద స్పూన్ తో చాక్లెట్ పానకం వాటికి నింపి,ఓక ఆపిల్ ని సన్న ముక్కలుగా కోసి,ఈ డిప్ లో ఆపిల్ ముక్కలు నంచుకుని తినేశాం.బ్రమ్హాండంగా వుంది.పెద్ద పెద్ద ఆవిష్కరణాలు ఇలా నాలాంటి మేధావుల చేతుల మీదుగా జరిగిపోతుంటాయి ఏంటో మరి!

ఇలాంటి చిన్నా చితకా ప్రయోగాలు చేసి నాకు కూడా వంట చెయ్యటం ఒచ్చని ఒక గట్టి నమ్మకం ఉండేది నాకు.ఏ వంట చేసినా వైవిధ్యం ఉండాలనే తపనతో కొన్ని కొత్త వంటకాలు కనిపెడితే,నన్ను జంధ్యాల సినిమా లో బంగాళా బవ్వ్ బవ్వ్ చేసిన శ్రీలక్ష్మి లాగా ఆరాధనా భావం తో చూడటం మొదలెట్టారు జనం.మచ్చుకి కొన్ని చెప్తా..

ఒకసారి పొటాటో కాస్సేరోల్  అనే పదార్ధం ఫ్రీ గా నో అర్ధరూపాయి కో(అంటే డాల్రున్నర)కో వస్తుందని ఒక తట్టెడు తెచ్చి పెట్టారు ఇంట్లో.రుచి బాగుంటే రెండు తట్టలు ఐనా అయిపోతుంది కానీ మనకి తవుడు తినే అలవాటు అంతగా లేకపోవటం తో ఫ్రిజ్ లో మగ్గింది ఒక నాలుగు రోజులు.అటు పారేయ్యలేక,ఇటు తినలేక బుర్రకి బాగా పదును పెట్టి,పావు భాగం తో ఉల్లిపాయలు, మసాలాలు దట్టించి అసలు పదార్ధం వాసన కూడా మిగలకుండా దాని రూపు రేఖలు మార్చేసా.అది నేనే స్వయంగా చేసిన బంగాళదుంప కూర అని నమ్మించి జనానికి పెట్టేసా.రోజూ అదే పెడితే అనుమానం వస్తుందని,ఇంకో పావు భాగం లో మైదా పిండి కలిపి అప్పచ్చలు చేసి నూనెలో వేయించి పెడితే,అమోఘం,దివ్యం అని లాగించేసారు.మరో పావు భాగం తో గోధుమపిండి కలిపి పరాఠ చేశా. ఇంకో పావు భాగం పాస్తా లో పడేసా,ఇంటికొచ్చిన చుట్టాలు ఖాళి చేసేసారు దాన్ని.ఒక రోజూ వంట ఎం చెయ్యాలో తోచక తిరుగుతుంటే,అప్పుడెప్పుడో ఒరిజినల్ రెసిపీ తో చేసిన బంగాళదుంప కూర భలే వుంది,మళ్ళి వండి పెట్టావా బుజ్జి అని అర్జీ పెట్టుకున్నారు మా వాళ్ళు.అర్జెంటు గా పొటాటో కాస్సేరోల్ ఎక్కడ దొరుకుతుందో కనుక్కోవాలి.

ఒరిజినాలిటి పోకుండా సాంబార్ లో అల్లం,వెల్లుల్లి,గరం మసాలా,కోడిగుడ్డు పచ్చ సోన లాంటివన్నీ వేసినప్పుడు మాత్రం కొడతాం అని బెదిరించారు.అందుకే మీరు కూడా ఎప్పుడూ ప్రయత్నించకండి.నెయ్యి వడపోస్తే బాటిల్ లో అందంగా కనిపిస్తుందని,మరిగే నేతిని ప్లాస్టిక్ స్త్రైనర్ తో వాడకట్టేసే ప్రయత్నం చేసాను ఒకసారి.కళ్ళ ముందు భలే కరిగిపోయింది ఆ ప్లాస్టిక్.అందుకే ఈ మధ్య స్టీల్ స్త్రైనర్ వాడ్తున్నాలే. ఇంతకి నేను చేసిన కేకు గురించి చెప్పానా.ఒక సిద్ధాంతం ఉంది.అన్ని మంచి పదార్ధాలు వేసి వండిన పదార్ధం ఏదైనా రుచిగానే ఉంటుంది అని.అది ఫాలో అయ్యి,కేకు కి కావాల్సిన సరంజామా తో పాటు,జీడిపప్పు,ఎండు ద్రాక్ష,బాదం పప్పులు,పాలు కుంకుమ పువ్వు,నారిజ రసం,చక్క లవంగం,కప్పు నెయ్యి,వెన్న,బంగినపల్లి మామిడి పండు ముక్కలు,కోకో పౌడర్, చిటికెడు బ్రూ కాఫీ పొడి,ఒక రెండు స్పూన్లు వనిల్లా ఐస్క్రీం వేసి బాగా కలిపి అవెన్ ఆన్ చెయ్యగానే మెరుపు మెరిసింది. అదే ప్లగ్ పేలిపోయింది.నాకు శకునాల మీద పెద్ద నమ్మకం లేదూ..తుమ్ము,పిల్లి,బల్లి ల లొల్లి అత్యవసర సమయం లో మాత్రం పట్టించుకుంటా.అందుకే ఆ ఘనపదార్ధాన్ని మైక్రోవేఉవ లో పడేసి పావుగంట తిప్పితే...ఘుమఘుమలాడే...అబద్ధం ఎందుకులే,
సిద్ధాంతం తప్పని తేలింది.గన్నేరు పప్పు ఒక్కటే మిస్సింగ్ ఇందులో అని ఎక్కిరించినట్టు కూడా గుర్తు.

నేను వండటం,వంట లో ప్రయోగాలు చెయ్యటం ఇంకా మానలేదు.ఒక లైసెన్సు ఇచ్చారుగా జనాన్ని వైద్యం తో వైవిధ్యంగా చంపటానికి,మళ్ళి ఇంకో లైసెన్సు ఎందుకని కొందరు గొణిగినా,నాకు ఇలాంటి మాటలకి సేలేక్టివే హియరింగ్ లాసు ఉంటుంది.
అందుకే కొత్త ప్రయోగం పూర్తవగానే మళ్ళి వస్తా..టాటా.

5, డిసెంబర్ 2009, శనివారం

ఏవేవో..

అప్పుడప్పుడు కబుర్లు చెప్పుకుంటుంటే భలే సరదా సంభాషణలు బయటికి వస్తాయి కదా.
మొన్న ఒక సాయంత్రం హాయిగా మన అరుగు మీద కుర్చుని కబుర్లు వేస్కుంటుంటే,టపటపా కాసిని చినుకులు  పడ్డాయి. పక్కనే ఉన్న కార్డ్ లెస్స్ ఫోన్ తడిసిపోతుంది అని దాన్ని చున్నీ లో దాచిపెడ్తుంటే,అమ్మకి ఒక చిలిపి ఆలోచన వచ్చింది. ఇప్పుడు మనం దాచిన ఫోన్ లోపల పిల్లలు పెడితే యేల ఉంటుంది అని.హీ..హీ.భలే నవ్వొచ్చింది.నిజమే,మనం అలా దాచేసిన తరువాత ఏదో కుయ్యి కుయ్యిమని శబ్దం వచ్చి,తీసి చూసేసరికి బోసి నవ్వులు నవ్వుతూ చెంగున ఒక రెండు ఫోన్ పిల్లలు బయటికి దూకితే యేల ఉంటుంది? భలే ఆలోచన కదూ:)

చిన్నప్పుడు అమ్మ,వాళ్ళ అక్కల కోసం,వాళ్ళ అమ్మమ్మ గారి ఇంటికి వెళ్లి,పుస్తకాలు,నవలలు తెచ్చేదట.అవి ఎలా తెచ్చేదనిన...
అప్పటికి అమ్మకి 5 సంవత్సరాలు వుంటాయేమో.అప్పటినుండి ఈ డ్యూటీ వేసారు మా పెద్దమ్మలు అమ్మకి.వాళ్ళ అమ్మమ్మగారి ఇల్లు ఏమో పక్కనే,పది అడుగుల దూరం కూడా ఉండదు కాని అప్పటికే మేనమామ గారి హయాము లో వుంది ఆ ఇల్లు.ఇష్టం వచ్చినట్టు ఆ ఇంట్లో తిరిగే స్వతంత్రం కూడా అలాగే పోయిందట.ఏడుగురు  సంతానం లో చివరాఖరు పిల్లాయే.అటు తనకన్నా వయసులో బాగా పెద్దవారైన అక్కల తో కూడా అంత  చనువు లేదూ.వాళ్ళకోసం తెచ్చే పుస్తకాలలో బొమ్మలు చూడచ్చు,పైగా అమ్మమ్మ గారింటికి వెళ్తే,చిన్న పిల్ల కదా అని పప్పులో,ఎండు ద్రాక్షో చేతిలో పెట్టేవారు కాబట్టి మొదట్లో త్వరగా వెళ్లి త్వరగా వచ్చేదట.మెల్లిగా అమ్మకి కూడా చదవటం వచ్చాక,ఆ ఇంటికి వెళ్ళటం ఏమో రెండడుగుల్లో అయిపోయేది.అక్కడ పుస్తకాల కట్ట తీస్కుని మండువాలోగిలి ఇంటి నుండి చీమ లాగా నడుచుకుంటూ,ఆ పుస్తకాలు దారిలో చదివేస్తూ రావటానికి మాత్రం అరగంట పట్టేదట.ఇప్పటికి మంచి పుస్తకాలు కొని చదవటం అమ్మకి బాగా అలవాటు.భారత భాగవతాలే కాక ఏదైనా వస్తువు పొట్లం కట్టిన కాగితాన్ని కూడా వదలకుడ చదువుతుంది అమ్మ.యథా మాతా తతా సుతా.మనకి అదే అలవాటు వచ్చిందనుకో:)

అమ్మ వాళ్ళ చిన్నన్నయ్య కి అమ్మ అంటే చాలా ఇష్టం.ఎంతైనా అబ్బాయి కదా అని చేసిన పరవాన్నం లో కాస్త ఎక్కువ నెయ్యి వేసి తనకి పెడితే..తీస్కొచ్చి అమ్మ నోట్లో పెట్టేవాడట.పొద్దున్నే నిద్ర లేపి,ఇందా ఈ పరవాన్నం తిను అని బ్రతిమాలి పెట్టబోతే, ఇంకా పళ్ళు తోముకోలేదు,వద్దు అనేదట అమ్మ.పిచ్చిదానా,నీకేం తెలుసు..పాచి మొహం తో పరవాన్నం తింటే పరవతం పోయోచ్చినంత పుణ్యం అని చెప్పి తినిపించేసేవాడట.తీరా తినేసాక రోజంతా ఎక్కిరించేవాడట.ప్రతి పండగ మరుసటి రొజూ ఇదే తంతు.ఒకసారి మోసపోతారు కానీ ప్రతిసారి ఎందుకు తిన్నావ్ అని నేను అమ్మని అడిగితె,పుణ్యం కోసం లే, పరవాన్నం కోసమేం కాదు అని నవ్వేస్తుంది:)

ఒకసారి బడికి సెలవులిచ్చినప్పుడు,పొలం దగ్గరికి వెళ్ళిందట అమ్మ.పదేళ్ళు వుంటాయేమో.పెద్దబావ అన్నం తినటానికి చేతులు కడుక్కోస్తా,ఇక్కడే కాపలా వుండు అని నిలబెట్టి వెళ్లారట.ఇంతలో ఒక పురుగు,పాక్కుంటూ వచ్చి అమ్మని పలకరించిందట. అసలే పురుగులంటే భయం.ధైర్యం చేసి,ఒక మట్టి బెడ తీస్కుని,గట్టిగా కళ్ళు మూసుకుని దాని నెత్తిన వేసిందట.కళ్ళు తెరిసి చూస్తే ఒకటికి రెండు పురుగులు కనిపించాయట.టార్గెట్ మిస్ అయ్యిందో,లేక నిజంగానే అది బతికొచ్చి సైన్యాన్ని వెంటతేచ్చుకుందో కానీ,అమ్మ 100 yards పరుగు పందెం పెడితే ఆ క్షణం లో వరల్డ్ రికార్డు ని బద్దలు కొట్టేసేదేమో.

ఇంట్లో పెద్ద పెద్ద గాబులు రెండు ఉండేవి.రొజూ వారి అవసరాలకి కావిడి తో నీళ్ళు తెచ్చి ఈ గాబులు నింపేవారట పెద్ద బావ.
ఆడవాళ్ళూ బిందెలతో తాగే నీరు తోడుకోచ్చేవారట.చిన్న పిల్ల కదా,నేను కూడా మోసుకోస్తా అని మారాం చేస్తుంటే,ఒక చెంబు ఇచ్చి,దీనితో తే లే చాలు అని చెప్పేవారట.ఒకసారి నీళ్ళు తోడుతుంటే ఒక తాబేలు పిల్ల చిక్కిందట.దానితో కాసేపు ఆడుకుని,తాబేలు అనే పదం నేర్చుకుంది అమ్మ.కప్పు అనటం మాత్రం వచ్చేది కాదట.అందుకని కప్పు కనిపించినప్పుడల్లా తాబేలు అంటాలే...తప్పెందుకు (కప్పు) తాబెలంటా లే అనేదట.

ఎన్నో రోజులు పగలు రేయి అనకుండా తీరిక దొరికినప్పుడల్లా..నిజం చెప్పాలంటే ఆ కబుర్ల కోసమే తీరిక చేసుకుని,మనసుకి మా మాటల పౌష్టికాహారం పెట్టి పోషించాము.ఎండాకాలం లో వడియాలు పెడ్తూ,చీరలకి గంజి పెట్టి ఆరేస్తూ,కనిపించిన ప్రతి కాయ ని జూసు చేస్కుని ఫ్రీజేర్ లో ఒక పుల్ల కూడా పెట్టి ఐస్ చేసి,మల్లెల వాసనలో,చల్లని వెన్నెలలో అరుగు కూడా మా కోసం ఎదురు చూసేట్టు మాట్లాడుకునేవాళ్ళం. చలికాలం లో రగ్గు కప్పుకుని ఆరు బయట అదే అరుగు మీద కుర్చుని,నిన్న చందమామ వలచి, మెచ్చి,జతకట్టిన తార ఎవరు అని తీవ్రంగా చర్చించేవాళ్ళం.చలికాలం లో కూడా ఐస్క్రీం తింటూ,ఇప్పుడు గడ్డకడితే నన్నారు వచ్చి మనిద్దరిని స్టవ్ మీద పెట్టి కరిగిస్తారు లే అని నవ్వుకునేవాళ్ళం.వానా కాలం లో చూరు కింద,గడప లో కుర్చుని హాట్ చాకోలేట్ తాగుతూ,చినుకుల్ని పలకరించేవాళ్ళం.ఆ వాన నీళ్ళు తిరిగొచ్చిన దారినంతా మేము నేమరేసుకునేవాళ్ళం.
ఈ కబుర్లు అన్ని నిర్విరామంగా దొర్లేది అలాంటప్పుడే.అదే అరుగు,అదే ప్రక్రుతి,ఋతువులు మారినా అవే కబుర్లు..మనసుకి నచ్చే కబుర్లు..ఏవేవో కబుర్లు.

26 August

వయసు తో సంబంధం లేకుండా ప్రియుని తలపు మనసులోకి వచ్చినప్పుడు ప్రతి ఆడమనసు  ఈ  పాటే  పాడుకుంటుందేమో  అనిపించింది. మనకి ఇంకా యెక్సపీరియన్సు లెదు కాని,ఇంత మంచి పాటని ఆస్వాదించకుండా ఉండలేకపోయాను.
నాకు తెలిసిన ప్రేమికుల రోజు,అమ్మ నన్నల రోజు,మంచి రోజు 26 ఆగష్టు ఎ కాబట్టి ఈ పాటకి ఆ పేరు పెట్టుకున్నాను.
(పాట నేను రాసాను అనుకునేరు!స్వయంవరం చిత్రం నుండి ...ఎత్తి రాసిందే  ;)

"మరల తెలుపనా  ప్రియా..మరల  తెలుపనా ..
ఎదలోయల  దాచుకున్న మధురోహల  పరిమళాన్ని
కనుపాపలు  నింపుకున్న చిరునవ్వుల  పరిచయాన్ని
మరల  తెలుపనా ...ప్రియా మరల  తెలుపనా

విరబూసిన  వెన్నెలలో తెరతీసిన  బిడియాలని..
ఆణువణువూ అల్లుకున్న అంతులేని  విరహాలని
నిదురపోని  కన్నులలో పవళించు  ఆశలని
చెప్పలేక ,చేతకాక..మనసుపడే  తడబాటుని
మరల  తెలుపనా ...ప్రియా..మరల తెలుపనా

నిన్న లేని భావమేదో కనులు తెరిచి కలయచుసి
మాటరాని  మౌనమేదో పెదవిమీద ఒదిగిపోయే
ఒక  క్షణమే  ఆవేదన..మరుక్షణమే  ఆరాధన
తెలియరాక  తెలుపలేక..మనసు పడె మధుర బాధ
మరల  తెలుపనా  ప్రియా..మరల తెలుపనా ...

4, డిసెంబర్ 2009, శుక్రవారం

తీపి ఊసులు

మొన్న ట్యాంక్బండు  మీద  అలా వెళ్తూ వుంటే చూసాను.
లేలేత అలలు హాయిగా ఊగుతూ వచ్చే పోయే జనాన్ని కూడా పట్టించుకోకుండా ఏదో తెలియని ఆనందం లో మునిగిపోయి ఉన్నాయి.అదే అడిగాను ఒక పిల్ల అలని,ఏమోయ్ ఏముంది ఇక్కడ నువ్వు ఇంతగా సంతోషపడటానికి?ఊరికే కిలకిలా నవ్వితే నిన్ను పిచ్చిదానివి అనుకుంటారు సుమా అని.నన్ను వింతగా చూసింది ఒకసారి.మళ్ళి కిలకిలా నవ్వేసింది.అర్రే..నాకు చెప్పు విషయం అని నేను అడిగితె..

నువ్వే పిచ్చి మొహం.మేము ఇంత హాయిగా ఎందుకు నవ్వుతున్నమో నీకు తెలియదా?గాలి చిలిపిది. ఎక్కడినుండో వస్తుంది.రొజూ ప్రతి క్షణం మమ్మల్ని పలకరిస్తుంది.కాసేపు మెల్లిగా తీపి ఊసులు చెప్తుంది.కాసేపు గట్టిగా వచ్చి చక్కిలిగిలి పెడ్తుంది.రోజుకొక కొత్త సువాసన మోసుకొస్తుంది మాకోసం.వింత వింత వస్తువులు చూపిస్తుంది.ఈ ఆనకట్ట దాటి మేము రాలేకపోయినా ప్రపంచం లోని వింతలూ విశేషాలు మాకు చేరేస్తుంది.ఎక్కడో సాగరం లో ఉన్న మా చుట్టాల కబుర్లు కూడా తెలుసుకుని వచ్చి మా క్షేమ సమాచారం వాళ్లకి చెప్తుంది.బాగా ఎండ వచ్చి మేము ఆ వేడికి ఆవిరి అయిపోతుంటే మాకోసం యెంతో దూరం వెళ్లి తెల్లటి పెద్ద పెద్ద మబ్బులని తీసుకొచ్చి గొడుగు వేస్తుంది.అంత ప్రేమగా ప్రతిక్షణం  మమ్మల్ని కనిపెట్టుకుని ఉంటుంది. ఇంత ప్రేమగా చూసుకునే నేస్తం ఉంటె,మేమే కాదు,నువ్వు కూడా జీవితాంతం సంతోషంగా ఇలా కిలకిలా నవ్వేస్తావ్ అని,మళ్ళి ఆ గాలి ఉయ్యాల మీద ఆడుకోవటం  మొదలుపెట్టింది.

బాగానే వుంది.అలలకి గాలి వుంది కాబట్టి సంతోషం అట.మరి గాలికి ఎందుకు ఇంత సంతోషం?ఆ మాటే గాలిని అడిగాను. ఏమోయ్..అవంటే పిల్లకాయలు,అల్పసంతోషులు.నిన్ను చూస్కుని మురిసిపోతున్నాయ్.మరి నువ్వు ఎవరిని చూసి ఇలా పల్టీలు కొడుతూ,ఎగురుతూ,గానులేస్తున్నావ్ అని అడిగా.వూ..ష్ మని వచ్చి నా జుట్టు అంతా చెరిపేసింది. ఓయ్..సుబ్భరంగా దువ్వుకున్నా తల చేరిపెసావ్.ఇంతకి నీ సంగతి చెప్పు అన్నాను.

గాలి గొంతు ఇంత అద్భుతంగా వుంటుంది అని అప్పటివరకు నాకు తెలిలేదు.వేణువు వూదినట్టు వుంది గాలి గొంతు. మట్టిబుర్ర..నిజమే కదా..వేనువుకి ఆ గొంతునిచ్చింది నేనే కదా అన్నది చిలిపి గాలి.తన సంతోషానికి కారణం చెప్పింది.తనని చూడగానే పరవశించే చెట్లని చూస్తే గాలికి ఆనందం అట.తను మెల్లిగా దాగుడుమూతలు ఆడినట్టు వస్తే లేలేత చిగురులు తలలు ఆడిస్తూ నాట్యం చేస్తాయ్ అట.తను గట్టిగా వీస్తే తన గొప్పతనం చూసి పెద్ద పెద్ద మానులు కూడా తలలు వంచి గౌరవిస్తాయ్ అట.జనం బారులు తీరి దేవుడి గుడి ముందు పడిగాపులు కాస్తుంటే తను మాత్రం చటుక్కున గర్భగుడిలోకి వెళ్ళిపోయి దణ్ణం పెట్టుకొచ్చి భక్తులకి హాయిగోలుపుతుందట. తనని నోటితో పొగడకపోయినా సృష్టి లోని ప్రతి ప్రాణి తనని ఇష్టపడుతుందట.అందుకే తన మాట విని మబ్బులు  కూడా అలలకి గొడుగు పడతాయి అట.ఒహో..చాల కధే వుందే గాలి దగ్గరా అనుకున్నాను.

మబ్బు కూడా మా మాటలు వింటుంటే ఆ వింత ఆకారాల్ని చూసి గాలి కన్ను కొట్టి ఈలలు వేస్తుంది.బాగుందర్రా మీ వరస.ఇంతకి మబ్బుగారు,తమరికి కూడా ఏమన్నా కారణం ఉందా ఇంత హాయిగా ఆకాశం లో దూదిపింజ లాగా తేలిపోతున్నారు అని అడిగాను.తన అసలు రహస్యం చెప్పేసింది మబ్బు.నన్ను చూసి ఇలా అడిగింది.

నీకు నిండు చందమామ అంటే ఇష్టమా?ఆయన నెచ్చెలి పేరు పెట్టుకున్నవుగా అని.ఓ..చాలా ఇష్టం అని చెప్పా. పున్నమి వెన్నెల లో ఆరు బయట నడుస్తూ ఆ చందమామని అందుకోవాలనీ, ఒక్కసారైనా చేతితో తనివితీరా  తాకాలని అనుకుంటావు కదా.నేను అలాంటి చందమామకి మెత్తటి దిండు ఏర్పాటు చేస్తాను.ఆ చల్లని వెన్నెల నా మీద పడితే సిగ్గుతో ఎర్రబడ్తాను.ఎవ్వరికీ వీలవని పని కదా చందమామ కి అంత దగ్గరగా వుండటం.నా వల్ల అయ్యింది అని,నెలకి ఒక్కసారే ఆ అదృష్టం వచ్చినా,ఆ తీపి జ్ఞాపకాలు తలుచుకుంటూ ఆ సిగ్గు దాచుకుంటూ రోజు సంతోష పడ్తూ వుంటాను అని చెప్పింది.

సృష్టికి మూలమైన ప్రతిదానిలో ఆనందం వుంది.ఎన్నో అవాంతరాలు రోజు ఎదురవుతూనే ఉంటాయి.కాని వాటిని అన్నిటిని అధిగమించి,సంతోషాలు మాత్రమే బయటకి చెప్పి,అందరికి ఆనందం పంచుతూ,చిన్న చిన్న విషయాలకే సంతోషపడుతూ వుంటే జీవితం అంతా ఆనందమే కదా..మరి మనం ఎప్పుడూ అలా వుండగలుగుతామో?

ఒక సినిమా కధ..cont 2.

Noah ఒకసారి సిటీ కి వస్తాడు ఆ ఇంటిని మార్చటానికి సామాను కొనుక్కోవటానికి.బస్సులో నుండి చూస్తే Allie కనిపిస్తుంది. తనకి కాబోయే భర్త తో చూసి బాధ గా వెనక్కి వెళ్లిపోతాడు Noah.కాని ఎందుకో ఎప్పటికైనా Allie తిరిగి వస్తుంది అనే పిచ్చి ఆశ తో ఆ ఇంటిని బాగు చెయ్యాలి అనే వెర్రి కోరిక బలంగా పెరిగిపోతుంది.ఇంక ఆ ఇంటి పనిలో పడిపోతాడు.

ముసలాయన మళ్ళి కధ ఆపేస్తాడు.తనని కలవటానికి తన పిల్లలు వచ్చారని,తర్వాత మిగతా కధ చెప్తాను అని అంటాడు.
ఈ కధ నాకు చాలా హాయిగా ఉంది.మీరు చాలా బాగా చెప్తున్నారు.నేను కూడా మీ కుటుంబాన్ని కలవచ్చా అని అడుగుతుంది ముసలమ్మా.ఓ తప్పకుండా అంటాడు ముసలాయన.ఆ వచ్చిన పిల్లలు అంతా విషాదంగా మొహాలు పెట్టుకుని ఉంటారు. ఒక చిన్న పిల్లడు వచ్చి ముసలమ్మని గాట్టిగా హత్తుకుంటాడు.ముసలమ్మా ఆశ్చర్యంగా చూసి,ఇంక మీరు మాట్లాడుకోండి.నేను అలిసిపోయాను.కాసేపు పడుకున్తాని అని వెళ్ళిపోతుంది.

అప్పుడు వచ్చిన ఆ పిల్లలు అంటారు,ఎందుకు నాన్నానువ్వు ఒక రోగిష్టి లాగా ఇక్కడ వుండటం?అమ్మ కి మనం గుర్తొచ్చేది లెదు అని తెలిసిపోయింది కదా.కావాలంటే ఇంటికి తీసుకెళ్దాం.మేము కూడా సాయం చేస్తాం.ఆవిడకి అన్నీ సమకూర్చి పెట్టటానికి.నువ్వు లేకుండా మాకు ఇంట్లో అస్సలు బాగోలేదు అని.ముసలాయన కన్నీళ్ళు పెట్టుకుని,ఇంక ఇదే నా ఇల్లు.మీ అమ్మే నాకు ఇల్లు.ఆవిడతో నే ఉంటాను,ఏది వచ్చిన సరే అని వాళ్ళని పంపేస్తాడు.సాయంత్రం ముసలమ్మని డిన్నర్ దగ్గర కలుస్తాడు ముసలాయన.ఆవిడ కధ ఏంటో తెలుసుకోవాలని ఆత్రంగా ఎదురు చూస్తుంటుంది.కధ కొనసాగిస్తాడు ముసలాయన.

తన పెళ్లి డ్రెస్ కొనుక్కుంటూ Allie ఒక పేపర్ లో Noah కడతున్నఇంటి గురించి చదివి,ఒక్క సారి అతన్ని కలవాలనుకుంటుంది. ఒక ఉదయం Noah ఇంటి ముందు ప్రత్యక్షం అవుతుంది.తనని చూడగానే Noah కి నోట మాట రాదు.నిన్ను ఒక్క సారి చూద్దాం అని వచ్చాను,యలా ఉన్నావ్ అని అడుగుతుంది Allie.అప్పటికి వాళ్ళు ఇద్దరు విడిపోయి 7 years అయ్యింది.ఏనాడు అనుకోనిది జరిగితే ఏమంటాడు Noah మాత్రం!బొమ్మలాగా Allie ని చూస్తాడు.ఇంక ఎం మాట్లాడాలో అర్ధం కాక,ఐతే ఇంక నేను వెళ్తాను లే,అసలు నాకే బుద్ధి లెదు.పెళ్లి పెట్టుకుని ఇలా రావటం పిచ్చిపనే అని గొణుక్కుంటూ కారు ని గేటు కి కొట్టేస్తుంది. అప్పుడు కదుల్తాడు Noah.లోపాలకి వస్తావా అని అడుగుతాడు.తప్పకుండా అని లోపలికి వెళ్తుంది Allie.

ఇల్లు మొత్తం తను అడిగినట్టే ఉండటం చూస్తుంది Allie.మనసు నిండా సందేహాలు.ఎందుకు నన్ను పట్టించుకోలేదు ఈ ఏడు సంవత్సరాలు అని.ఇద్దరు కబుర్లు చెప్పుకుంటారు.ఒకరిని ఒకరు నిజంగానే బాగా ఇష్టపడడం కదా అని కూడా అనుకుంటారు.సాయంత్రానికి Allie ఇంక హోటల్ కి వెళ్ళిపోతాను అంటుంది.వీలయితే రేపు ఒక్కసారి వస్తావా అంటాడు Noah.నిన్ను ఒక చోటకి తీసుకెళ్ళాలి అంటాడు.సరేనంటుంది Allie.

మరుసటి రోజు ఒక బోటులో,బోలెడన్ని బాతులు ఈదుతున్న ఒక కొలను దగ్గరికి తీసుకెళతాడు Noah.అంతా కల లాగా వుంటుంది అక్కడ.అదే మాట అంటుంది Allie.మద్యలో భోరున వర్షం.వాళ్ళ బావోద్వేగాలు తెలీకుండా పెద్ద వర్షం.ఉండపట్టలేక Allie అడుగుతుంది,ఎందుకు నాకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు,మన మధ్య అంతా ఐపోయింది అనుకున్నావా అని.
ఆశ్చర్యపోయి Noah అంటాడు,నేను 365 ఉత్తరాలు రాసాను.రోజుకి ఒకటి అని.ఇద్దరి మనస్పర్ధలు తొలగిపోతాయి.రెండు రోజులు అక్కడే ఉండిపోతుంది Allie.ఇంక ప్రపంచం తో సంబంధం లెదు అనుకుంటారు ఇద్దరు.ఈ లోపు Allie వాళ్ళ అమ్మ వస్తుంది అక్కడికి.కూతురిని తనతో కాసేపు డ్రైవ్ కి రమ్మంటుంది మాట్లాడాలి అని.

ఒక చోటికి తీస్కుని వెళ్లి,ఒక చిన్న స్థాయి పని చేస్కునే అతన్ని దూరం నుండి చూపిస్తుంది ఆవిడ.నేను అతన్ని నీ వయసులో ఉన్నప్పుడు ప్రేమించాను.ఇద్దరం పారిపోతుంటే పోలీసులు పట్టుకుని మా పేరెంట్స్ కి అప్పచెప్పారు.మీ నాన్నకి ఇచ్చి పెళ్లి చేసారు నన్ను.ఈ రోజు ఇలా బ్రతుకుతున్నాను అంటే అది మీ నాన్న వల్లే.ఆయన చాలా మంచి మనిషి.కాని మొదటి ప్రేమని మర్చిపోలేక ఇక్కడికి వచ్చినప్పుడల్లా అతన్ని దూరం నుండి చూస్తుంటాను.నువ్వు ఇంక పెద్దదానివి అయిపోయావు. జీవితాంతం నీకు తోడూ గా ఉండేవాడిని ఎంచుకో.సరైన నిర్ణయం తీస్కో అని చెప్పి,Noah రాసిన ఉత్తరాల కట్ట చేతిలో పెట్టి,వెళ్ళబోతూ,నీ కాబోయే భర్తకి ఈ విషయం తెలిసి అతనూ ఇక్కడికి వచ్చాడు.మీ నాన్న మీ సంగతి అతనికి చెప్పారు.ఇంక నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతుంది.

Allie ఆలోచన లో పడుతుంది.తనకిNoah అంటే పిచ్చి ప్రేమ.కాని పెళ్లి చేస్కుందాం అనుకున్నా అతను అన్నాకూడా ఇష్టమే.ఆ మాటే Noah తో అంటుంది.నేను అతన్ని కష్టపెట్టలేను అని.Noah కోప్పడతాడు. అందరికి ఎం కావాలో నువ్వు ఆలోచించకు. నీకేం కావాలో అది చెప్పు ముందు అంటాడు.అతనితో ఇంకా పెళ్లి కాలేదు కదా అంటాడు.కాని నా మాట ఇచ్చి ఉంగరం  తోదిగించుకున్న కదా అంటుంది Allie.అంటే ఈ రెండు రోజులు నాతో గడిపి ఇప్పుడు ఎమీ తెలియనట్టు అతన్ని పెళ్లి చేసుకుంటావా? ఏదో ఒక నిర్ణయం తీస్కుని దాని మీద నిలబడు అని విసుక్కుంటాడు.చూడు మనం అప్పుడే తన్నుకున్తున్నాం కదా అంటుంది Allie.

విసురుగా కారు ఎక్కి స్టార్ట్ చేస్తుంది.పరిగెత్తుకుంటూ కారు దగ్గరికి వచ్చి Noah Allie తో అంటాడు,నువ్వు నీ మనసుకి నచ్చిన పని చెయ్యి.నాకు ఎం కావాలో,మీ అమ్మకి ఎం కావాలో ఇవన్ని కాదు ఆలోచించేది.మనం ఇలా తిట్టుకున్నా,తన్నుకున్నా, జీవితాంతం నీతో ఉండాలని నేను కోరుకుంటున్నాను.ఆ పైన నీ ఇష్టం.నిన్ను ఒక సారి పోగొట్టుకున్నాను.మళ్ళి కోల్పోవటం కష్టమే ఐనా నీ నిర్ణయం మీద అంతా ఆధారపడి ఉంది అని.Allie కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతుంది.దారి లో Noah తనకి రాసిన ఉత్తరాలు చదువుతుంది.తను చేస్కుందాం అనుకున్నతనికి అన్ని విషయాలు చెప్తుంది.నాకు Noah అంటే చాలా ఇష్టం.కాని నువ్వన్న కూడా ఇష్టం అని అంటుంది.అతనేమో నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం.పెళ్ళికి ముందు ఇల్లంటివి ఏమున్నా పెళ్లి అయిన తర్వాత మనం ఒకరిని ఒకరం బాగా ఇష్టపడతాం లే అని ప్రాధేయపడతాడు .

ముసలాయన కధ ఆపేస్తాడు.ఒకసారి ముసలమ్మా వైపు చూసి "వాళ్ళు కలకాలం సంతోషంగా వున్నరు"
"and they lived happily ever after" అంటాడు.ముసలమ్మా ఈయన వైపు చూసి,ఎవరు? ఎవరు హ్యాపీలీ ఎవెర్ ఆఫ్టర్ ?Allie ఎవరిని ఎంచుకుంది?అని నాలుగైదు సార్లు అడుగుతుంది.ముసలాయన పలకడు.మెల్లిగా ముసలాయన వైపు చూస్తూ,ఏదో  గుర్తొచ్చినదాని లాగా,మనమే కదా..ఇది మన కధే కదా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంది.

అప్పుడు చూపిస్తారు Allie Noah దగ్గరకి సూట్కేసు సర్దుకుని వచ్చేస్తుంది.

ముసలమ్మ అంతా గుర్తొచ్చిన దాని లాగా అడుగుతుంది,ఎన్నాళ్ళు అయ్యింది నేను ఇలా అయిపోయి అని.ముసలాయన చెప్తాడు,పోయినసారి ఒక వారం లో మళ్ళి అంతా మర్చిపోయావు.ఈ సారి మళ్ళి ఈ క్షణమో లేక ఇంకొన్ని రోజులో తెలీదు అని.
Allie తనకి ఈ మర్చిపోయే జబ్బు వుందని,Noah కి,అదే తన భర్త కి, ఒక నోట్ బుక్ లో వీళ్ళ కధ అంతా రాసి ఇస్తుంది.  ఎప్పుడన్నా నేను గతం మర్చిపోతే నాకు ఈ కధ చదివి వినిపించు.నాకు అంతా గుర్తోచ్చేస్తుంది అని.ఆవిడని కంటిపాప లాగా చూసుకుంటూ,ఆమె తో నే వుండి,ఆవిడ గతం మర్చిపోయినప్పుడల్లా ఈ కధ చదివి గుర్తు చేస్తుంటాడు Noah .

పిల్లలు ఎలా ఉన్నారు అని అడుగుతుంది ముసలమ్మ.బాగానే వున్నరు,ఇవాళ వచ్చి వెళ్లారు అని చెప్తాడు ముసలాయన.నాకు వాళ్ళంటే చాలా ప్రేమ అని చెప్పు,ఈ జీవితానికి సొంత పిల్లలని కూడా గుర్తు పెట్టుకునే భాగ్యం లేదని అంటుంది ముసలమ్మ.
ఇద్దరు పాత జ్ఞాపకాలు నెమరేసుకుంటూ అలా ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని పాడుకుంటారు.మన ప్రేమ మనిద్దరిని ఒకే సారి తీసుకుపోతుందా అని అడుగుతుంది ముసలమ్మ.మన ప్రేమ ఏమైనా చేయిస్తుంది.అంతా మనకి కావల్సినట్టే జరుగుతుంది అని అంటాడు ముసలాయన.

మరో ఉదయం ఉన్న లేకున్నా ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని దగ్గరగా వొదిగి సంతృప్తిగా పాడుకుంటారు.

సినిమా ఐపోయింది.ఇంక పనులు చేస్కోవచ్చు...ఇంతకి సినిమా పేరు చెప్పలేదు కదా.."The Notebook".
Nicholas Sparks రాసారట నవల.బాగా అమ్ముడు పోయిందని సినిమా తీసారు.నాకు బాగా నచ్చింది. మరి మీకో?

ఒక సినిమా కధ cont..1

మళ్ళి ముసలాయన కధ  మొదలుపెట్టబోతుంటే,Mr.Duke,డాక్టర గారు మిమ్మల్ని చూస్తారు ఇప్పుడు,అని నర్స్ వచ్చి చెప్తుంది. ఈయన డాక్టర్ దగ్గరకి వెళ్ళగానే ఆ డాక్టర్ అంటాడు,నేను కొత్తగా వచ్చాను ఇక్కడికి.మిమ్మల్ని పర్సనల్ గా ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాను,ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అని.నాకు బాగానే వుందండీ.రోజుకి 2 సార్లు టాబ్లెట్ లు కూడా టైం కి వేస్కున్తున్నాను అంటాడు Duke.మీకూ ఇంతకముందు హార్ట్ ఎటాక్ వచ్చింది కదా అని డాక్టర్ అడిగితె,అవునండి రెండు సార్లు వచ్చింది అంటాడు.ముసలాయన తను చదువుతున్న పుస్తకం ముసలమ్మా కి ఇచ్చి వస్తాడు పేజి గుర్తు పెట్టుకోమ్మని.
మీరు Allie గారికి కధ చేప్తున్నరటా?అంతా వృధా ప్రయాస కదా.ఆవిడకి మీరు ముందు చెప్పిన ముక్కే గుర్తుండదు.Alzemiers dementia అంటే అంతె కదా.మెమరీ ఎమీ వుండదు అని అంటాడు డాక్టర్.లేదండి.ఆవిడకి గుర్తొస్తుంది.నాకు ఆ నమ్మకం వుంది.ఆవిడ పియానో వాయిస్తుంది,వినండి అంటాడు ముసలాయన.అప్పుడు మనకి సన్నగా ముసలమ్మా పియానో పాట గుర్తు చేస్కుని వాయించటానికి ప్రయత్నించటం కనిపిస్తుంది.

ఇంక ముసలాయన ఆవిడ దగ్గరికి వెళ్లి మళ్ళి కధ చదవటం మొదలు పెడతాడు.

Allie,Noah కలిసి హాయిగా ఊరంతా తిరుగుతూ సంతోషంగా గడిపేస్తుంటారు.ఒక రోజు Allie,Noah వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ నాన్నని కూడా కలుస్తుంది.అప్పుడు Noah తను రాసిన కవిత్వం చదువుతూ ఉంటాడు.వాళ్ళ నాన్న చాలా సాదరంగా Allie ని ఆహ్వానిస్తాడు.Noah కి చిన్నప్పుడు నత్తి ఉండేదని,అందుకే కవిత్వం చదవటం అలవాటు చేసానని,ఇప్పుడు అందుకే నత్తి పోయి బాగా కవిత్వం వంటబట్టింది అని ఇంకా  చాలా కబుర్లు చెప్పి,బ్రేక్ ఫాస్ట్ చేస్తావా అని అడుగుతాడు Allie ని.Noah నవ్వుతాడు.నాన్నా,ఇప్పుడు రాత్రి 10 అయ్యింది అని.ఆయనా నవ్వేసి,మనం పాన్ కేకు లు కదా తినబోతున్నాం.ఏ టైం లో తిన్నా అవి బ్రేక్ ఫాస్ట్ ఎ లే అని లోపాలకి తీస్కుని వెళ్తాడు.

ఇలా గడిచిపోతుంటే,Allie ని వాళ్ళ ఇంటి దగ్గరా దింపటానికి వెళ్ళినప్పుడు Allie వాళ్ళ నాన్న Noah ని చూస్తాడు.కూతురు యెంత సంతోషం గా వుందో కూడా చూస్తాడు.ఆయన ఎలాంటి అభ్యంతరం చెప్పాడు.పైగా Noah ని వాళ్ళ ఇంటికి లంచ్ కి రమ్మని ఆహ్వానిస్తాడు.లంచ్ కి Noah వచ్చిన రోజు చాలా మంది చుట్టాలు కూడా వుంటారు ఆ ఇంట్లో.ఇదేమో చిన్న పల్లెటూరు. అక్కడ  ఉన్న వాళ్ళంతా బాగా గొప్ప వాళ్ళు.నువ్వేం చేస్తుంటావు అని Noah ని అడుగుతారు.నేను lumberjack,అదే మన చెట్లు కొట్టి చెక్క తో పని చేసే చోట పని చేస్తాను అని చెప్తాడు Noah.అబ్బో ఐతే యెంత సంపాదిస్తావ్ అని అడుగుతారు చుట్టాలు.గంటకి 40 cents వస్తాయి,అది తక్కువే అనుకోండి,కాని నా అవసరాలు కూడా తక్కువేగా అంటాడు Noah.

ఇంతకి Allie వాళ్ళ అమ్మకి ఈ సంబంధం ఏమాత్రం నచ్చదు.తన అంతస్తు పట్టించుకోకుండా తన కూతురు ఆఫ్ట్రాల్ ఒక మామూలు ఊరివాడితో ఇలా రాసుకు పూసుకు తిరగటం ఆవిడకి నచ్చదు. మాటల మధ్యలో ఆవిడ కావాలని,మా Allie కాలేజీ కి వెళ్ళబోతుంది,వచ్చే వారం చాలా దూరంగా వున్న ఆ కాలేజీ కి వెళ్ళిపోతుంది అంటూ Noah వైపు చూస్తుంది.అవునా,నాకు తెలియదే అంటాడు Noah.చూసావా నా కూతురు నీకు చాలా విషయాలు చెప్పలేదు అన్నట్టు ఆవిడ గర్వంగా చూస్తుంటే, Allie వాళ్ళ అమ్మ వైపు కోపంగా చూసి,Noah తో అంటుంది,నేనే చెప్దాం అనుకున్నాను.ఇందాకే లెటర్ వచ్చింది కాలేజీ నుండి అని.ఇప్పుడు కాకపొతే తర్వాత చెప్పేదానివి.అందులో అంతగా వర్రీ అయ్యేది ఏముందు అని Noah నవ్వేస్తాడు.

ఇంక ఒక వారం లో Allie వెళ్ళిపోతుంది అనగా Noah తనని ఒక పెద్ద బంగ్లా దగ్గరికి తీస్కుని వెళ్తాడు.అది మనుషులు ఎవరు లేకుండా పాడుబడి ఉంటది.తన కల ఏంటో Allie కి చెప్తాడు Noah.ఎప్పటికయినా ఇది కొని బాగు చేయించి,నాకు ఇష్టం అయినట్టు అందంగా తీర్చిదిద్దాలి ఈ ఇంటిని అంటాడు.అది నీ ఒక్కడి కలేనా.నాకు స్థానం లేదా నీ కలలో అని అంటుంది Allie. ఎందుకు లేదూ,నీకు ఎం కావాలి ఇక్కడా అని Noah ఆంటే,సాయంత్రం సూర్యుడిని చూస్తూ బొమ్మలు వేస్కోవటానికి ఒక గది కావలి, పైన మనం కుర్చుని కబుర్లు చెప్పుకోవటానికి ఒక పెద్ద బాల్కనీ అని ఇలా తన ఇష్టాలు అన్నీ చెప్తుంది Allie.వాళ్ళు ఇద్దరు కబుర్లలో పడిపోయి సమయం మర్చిపోతారు.రాత్రి 2 అవుతుంది.వాళ్ళ ఫ్రెండ్ పరిగెత్తుకుంటూ వచ్చి,మీరు ఇద్దరు ఇక్కడ ఉన్నారా,Allie వాళ్ళ అమ్మ మొత్తం పోలీసు ఫోర్స్ ని దించేసింది తన కూతురు కనిపించలేదని అని చెప్తాడు.

Noah Allie ని వాళ్ళ ఇంటికి తీస్కుని వెళ్తాడు.Allie వాళ్ళ నాన్న Noah ని కింద హాల్ లోనే కూర్చోమని,కూతురిని పైకి తీస్కుని వెళ్తాడు.Allie వాళ్ళ అమ్మ బాగా తిట్టి,ఇంక ఎప్పటికి నువ్వు Noah ని  కలవటానికి వీలులేదు అని చెప్తుంది.నువ్వు
ఎవరు నేను ఎవరిని ప్రేమించాలో వద్దో చెప్పటానికి అని పెద్దగా అరుస్తుంది Allie.నీకు తిండి బట్టా ఇస్తున్నంతకాలం నాకు ఆ హక్కు వుంది అని వాళ్ళ అమ్మ కూడా అరుస్తుంది.వాళ్ళ నాన్నతో,నేను Noah ని ప్రేమిస్తున్నాను,అతను లేకుండా ఉండలేను అంటుంది.వాళ్ళ అమ్మ కల్పించుకుని,నీకేం తెలుసు ప్రేమ గురించి,నిండా 17 yrs లేవు అనేసరికి,నేను Noah తో ఉన్నంత చనువుగా నువ్వు నాన్న తో ఏనాడు లేవు.నీకా ప్రేమ గురించి తెలిసింది అని అరిచి ఏడుస్తుంది Allie.

ఈ రాబస అంతా వింటాడు Noah.Allie వాళ్ళ అమ్మ అన్న మాటలు అర్ధం అవుతాయి.ఆవిడ ఎంతసేపటికి 40 cents గంటకి సంపాయించే వాడు నిన్ను ఎం పోషిస్తాడు అంటుంది.ఇంక లేసి బయట వర్షం పడ్తున్న అలాగే వెళ్ళిపోతాడు Noah.Allie పరుగెత్తుకుంటూ వచ్చి,చాలా సారీ,మేము నిన్ను అవమానిన్చాము.క్షమించు అంటుంటే Noah అంటాడు.లెదు,మీ అమ్మ చెప్పిన మాటలు చాలా కరెక్ట్.ఈ summer romances ఎన్నాళ్ళు  వుంటాయి చెప్పు?నిజమే..మన ఇద్దరికీ ఒకరంటే ఒకరికి చచ్చే అంత ఇష్టం.కాని మిగతా విషయాలు కూడా చూడాలి కదా.ఇవాల్టికి పడుకో.ఈ వారం ఆలోచిద్దాం అంటాడు.

Allie కి  వొళ్ళు మండిపోతుంది.ఏంటి నువ్వు ఆలోచించేది..నేను నీతోనే ఇక్కడే వుండిపోతాను.లేదా నువ్వు న్యూయార్క్ వచ్చి మాతోపాటు ఉండు అంటుంది.కాదు లే ఆలోచిన్చుకుందాం అని Noah అనేసరికి,ఆంటే ఏంటి?నన్ను వదిలేస్తావా.ఈ వారం ఆగాక చేసే పనేదో ఇప్పుడే చెప్పు.నీకు నేను వద్దని ఇప్పుడే చెప్పు.అసలు నువ్వు చెప్పేది ఏంటి.నీ మొహం నాకు చూపించకు అని కసురుకుంటుంది. Noah ఏడ్చుకుంటూ కారు ఎక్కి వెళ్లిపోతుంటే,పాపం మళ్ళి తను కూడా ఏడుస్తూ,మన మధ్య ఎమీ ఐపోలేదు కదా.రేపు పొద్దున నిద్ర లేసి చుస్తే అంతా సర్దుకుంటుంది కదా అని జాలిగా అడుగుతుంది.

మరుసటి రోజు నిద్ర లేచేసరికి సామాను అంతా సర్దేసి వుంటుంది.ఇదేంటి అని Allie అడిగితె,వాళ్ళ అమ్మ,మనం ఇంకో వారం ఇక్కడ వుండబోవట్లేదు.ఇప్పుడ బయల్దేరి వెళ్లిపోతున్నాం అంటుంది.వెళ్లిపోయేప్పుడు Allie,Noah ఫ్రెండ్ ని కలిసి,ఎక్కడ ఉన్నాడు Noah?మేము రాత్రి కాస్త గొడవ పడ్డాము.మా మధ్య బ్రేక్ ఆఫ్ ఎం అవలేదు.ప్లీజ్ తనకి ఐ లవ్ హిం అని చెప్పవా అని అడుగుతుంది.Noah పొద్దున్నే పనికి ఎటో వెళ్ళిపోయాడు.రాత్రి బాగా బాధపడి మా మధ్య ఇంకేం లెదు అని చెప్పేసాడు.తనకి ఇష్టం వుంటే నీకు తప్పకుండా ఉత్తరం రాస్తాడు లే అని ఆ ఫ్రెండ్ ధైర్యం చెప్పి పంపిస్తాడు.

న్యూ యార్క్ లో Allie ఏడ్చి ఏడ్చి తిండి తిప్పలు మానేస్తుంది.ఇక్కడ Noah కూడా తను లేకుండా ఉండలేను అని రోజుకి ఒక ఉత్తరం చొప్పున 365 days ఒక్కో  లెటర్  రాస్తాడు.Allie వాళ్ళ అమ్మ ఆ ఉత్తరాలు అన్నీ దాచేస్తుంది.ఇంక Noah నిజంగానే తనని మర్చిపోయాడేమో అని Allie కాలేజీ లో చేరి, నర్స్ గా హాస్పిటల్ లో సాయం కూడా చేస్తుంటుంది.
Allie నుండి జవాబు రాకపోయేసరికి తనని మర్చిపోయింది అని Noah అండ్ తన ఫ్రెండ్ మిలిటరీ లో చేరిపోతారు.యుద్ధం లో Noah ఫ్రెండ్ చనిపోతాడు.

యుద్ధం అయిపోయాక ఇంటికి తిరిగి వస్తాడు Noah.వాళ్ళ నాన్న తనని గుండెలకి హత్తుకుని నీకొక సర్ప్రైజ్ అని అంటాడు.ఏంటి అని అడిగితె,ఈ ఇల్లు అమ్మేసాను.నీకు ఆ పాత బంగ్లా కొని మార్చాలి అని కోరిక కదా.ఇప్పుడు  కొనుక్కో అని చెప్తాడు.ఆ ఇంటిని చూడగానే మళ్ళి Allie జ్ఞాపకాలు తన్నుకోస్తాయ్ Noah కి.

Allie నర్స్ గా చేరినా హాస్పిటల్ లో ఒక మిలిటరీ ఆఫీసర్ వొంటినిండా కట్లు కట్టించుకుని వుండి కూడా Allie ని నాతో డేట్ కి వస్తావా అని అడుగుతాడు.ఆ పరిస్తితి లో కూడా అలా అడగగలిగిన అతన్ని చూసి నవ్వుకుని,సరేలే,ముందు కట్లు తియ్యనివ్వు.అప్పుడు చూద్దాం అంటుంది.అతను బాగు అవ్వగానే Allie ని కలుస్తాడు.చాలా గొప్పింటి బిడ్డా.పైగా మిలిటరీ ఆఫీసర్ కదా. Allie వాళ్ళ అమ్మ నాన్న కి కూడా చూడగానే నచ్చుతాడు.తెలీకుండానే Allie కి అతను బాగా నచ్చుతాడు.అతను పెళ్లి ప్రస్తావన తెచ్చిన క్షణాన ఒప్పెసుకుంటుంది Allie.కాని మరు క్షణం లో Noah మొహం కళ్ళల్లో మెదుల్తుంది.

కధ బాగుందా? వింటున్నారా బాగా..మంచిది..కాసేపు పిల్లగాలి పీల్చుకుని రండి. మళ్ళి మొదలెడతా.. :)

ఒక సినిమా కధ

నిన్న ఒక సినిమా చూసాను.ఇంగ్లీష్ సినిమా.కాని చాలా సున్నితంగా బాగుంది.అమ్మ పక్కనే ఉంటె కట్టేసి కూర్చోపెట్టి మరీ కధ చెప్పేదాన్ని.ఇప్పుడు అలా కుదరదు కాబట్టి..ఇక్కడ చెప్తా.

సినిమా మొదలు అవటమే ఒక ఓల్డ్ ఎజి హోం లాంటి ప్రదేశం లో ఒక ముసలాయన పొద్దున్నే నిద్ర లేసి,తన స్నేహితులందరికీ గుడ్ మార్నింగ్ చెప్పి,నర్సేస్  స్టేషన్ దగ్గరికి వచ్చి తను ఆ పుట వేస్కోవాల్సిన మందులు వేసేస్కుని,అక్కడ ఉన్న నర్స్ తో "ఇవాళ చాలా మంచి రోజు" అంటాడు.ఆ అమ్మాయి నవ్వి,మీరు రోజు అదే మాట చెప్తారండి,ఈ రోజు చాలా స్పెషల్ అని,కాని నాకు అలా ఎమీ అనిపించట్లేదు అంటుంది.మన ముసలాయన నవ్వి,కాదు..ఈ రోజు నిజంగా చాలా మంచి రోజు అని నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు.
పక్కన ఒక రూం లో ఒక ముసలమ్మా రెడ్ కలర్ స్కిర్ట్ సూట్ వేస్కుని చాలా క్లాసు గా ఉంటుంది.ఆవిడ మొహాన ఒక రకమైన confused look .. నర్స్ ఏమో ఆవిడని కాసేపు బయటికి రండి,ఒక్కరే రూం లో ఎం కూర్చుంటారు.లేకపోతె కాసేపు ఆ పియానో ఐనా వాయించండి అంటుంది.దానికి ముసలమ్మా ఏమో,నాకు పియానో వాయించటం రాదు..ఆ ఆసక్తి కూడా లేదు.నేను రూం లో బాగానే ఉన్నాను అంటుంది.
ఈ లోపు ముసలాయన అక్కడికి ఒక పుస్తకం పట్టుకుని వస్తాడు.నర్స్ ఆయన్ని చూడగానే..Allie గారు,మీకోసం Mr.Duke వచ్చారు.మీకు ఆయన ఇవాళ ఒక పుస్తకం చదివి వినిపిస్తారు అంటుంది."he's going to read to me??" అని ఆవిడ అంటుంటే, ముసలాయన,ఎస్..ఒక మంచి కధ చెప్తాను మీకూ.మీరు ఎప్పుడూ విని ఉండరు అని అంటూ ఆవిడని బ్రేక్ ఫాస్ట్  టేబుల్ దగ్గరికి తీసుకువెళ్ళి,కధ మొదలుపెడతాడు.
ఇప్పుడు మనకి ఆయన చెప్పే కధ ఫ్లాష్ బ్యాక్ లో కనిపిస్తుంది.

ఇద్దరు కుర్రాళ్ళు ఒక ఫెయిర్ కి (మన సంత లాంటిది) వెళ్తారు. ఆ ఇద్దరిలో బాగుండేవాడు మన హీరో అని చెప్పక్కర్లేదుగా:)
మన హీరో పేరు Noah అనమాట. అక్కడ Allie అనే 17yr రిచ్ క్లాసు అమ్మాయి తన స్నేహితురాలి తో ఉంటె చూసి,మన హీరో మొదటి చూపులో నే ఇష్టపడతాడు.ఆ Allie ఫ్రెండ్ అండ్ Noah ఫ్రెండ్ ఇద్దరు గర్ల్ ఫ్రెండ్-బాయ్ ఫ్రెండ్ అనమాట.హీరో ఫ్రెండ్ చెప్తాడు..ఆ అమ్మాయి మన ఊరికి ఈ వేసవి సెలవులు గడపటానికి తన కుటుంబం తో వచ్చింది అని.
Noah ధైర్యం చేసి Allie దగ్గరకి వెళ్లి,మీరు నాతో డాన్స్ చేస్తారా అని అడుగుతాడు.చెయ్యను అని సింపుల్ గా అనేస్తుంది హీరోయిన్.ఏ?ఎందుకని?అంటాడు హీరో."i donno because i don't want to ?! antundi heroin.
చుట్టూ ఉన్న వాళ్ళు అందరు నవ్వుతారు.

ఇంక హీరోయిన్ వేరే అబ్బాయి తో జైంట్ వీల్ ఎక్కి,హీరో వైపు చూస్తూ పక్కన ఉన్నఅబ్బాయి తో కబుర్లు వేస్తుంటుంది.ఇంక noah ఏమో ఆ జైంట్ వీల్ మీదకి పరుగెత్తుకుంటూ వచ్చేసి,Allie పక్కన కూర్చుంటాడు. కింద నుండి ఆ జైంట్ వీల్ నడిపే వాడు,బాబోయి ఒక్క సీట్ లో ముగ్గురు కూర్చోకూడదు,మా రూల్స్ ఒప్పుకోవు అని గోల పెద్తుంటాడు.అందుకని Noah ఆ సీట్ ముందు ఉన్న రాడ్ పట్టుకుని వేలాడుతూ,నాతో బయటికి వస్తావా లేదా అని అడుగుతాడు హీరోయిన్ ని.మళ్ళి రాను అనే అంటది ఆ పిల్ల.ఒక్క చెయ్యి వదిలేస్తాడు హీరో.కెవ్వు మని అందరు అరుస్తారు.ఇంకొక్క సారే అడుగుతాను..నో చెప్తే చెయ్యి వదిలేస్తాను అంటాడు హీరో.సరేలే..ఐతే వస్తాలే అంటుంది Allie. మాటివ్వు అంటాడు హీరో.సరేలే కానీ, ఇప్పుడు నేను చేసే దానికి ఎం అంటావోయి అని హీరో ప్యాంటు విప్పెస్తుంది.అందరు బాగా నవ్వుతారు.ofcourse మన హీరో లోపల పొడవు నిక్కేర్ వేసుకుంటాడనుకో ;)

తర్వాత రెండు రోజులకి Allie రోడ్ మీద కనిపిస్తుంది హీరో కి.దగ్గరికి వెళ్లి నన్ను గుర్తుపట్టావా అని అడుగుతాడు.ఎందుకు గుర్తు లేవు Mr.Long Underpants అని నవ్వుతుంది.ఇంక హీరో,మొన్న జరిగినదానికి క్షమించు.నేను అలా ఎప్పుడూ ప్రవర్తించలేదు.అసలు ఇప్పటివరకు ఎవరిని చుసిన ఇలా అనిపించలేదు.అందుకే నిన్ను నాతో బయటికి రమ్మన్నాను అంటాడు. మాటలు బలే బాగా చెప్తున్నావ్,అందరమ్మాయిల దగ్గరా ఇవే మాటలు ప్రయోగిస్తావా అని అడుగుతుంది Allie .
అప్పుడు హీరో అంటాడు.."look...u don't know me...but i know me...నేను మంచి వాడిని. చెప్పాగా, మునుపెప్పుడు ఇంకెవరితోనూ ఇలా ప్రవర్తించలేదు..అని..మన ప్రామిస్ సంగతి ఏంటి అంటాడు.
అంతా తూచ్..నాకు ప్రామిస్ నిలుపుకోవాలి అని లేదు అని నవ్వుకుంటూ కారు ఎక్కి వెళ్ళిపోతుంది.

మన హీరో స్నేహితుడు అండ్ తన ప్రియురాలు కలిసి ప్లాన్ వేసి,Noah ని Allie ని సినిమా కి పిలుస్తారు.ఒకరికి ఒకరు తెలియకుండా అక్కడ యాదృచ్చికంగా కలిసినట్టు.ఆ సినిమా ఎంజాయ్ చేసాక,హీరో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ ని,మీరు వెళ్ళండి,మేము నడుస్తూ వస్తాం అని చెప్తారు.నడుచుకుంటూ వెళ్తుంటే Allie అంటుంది,నేను చిన్నపిల్ల గా ఉన్నప్పుడు సినిమా చూసాను.మళ్ళి ఇప్పుడే చూడటం,అందుకే బాగా నచ్చింది..i had a good time అని.

హీరో ఆశ్చర్యపోయి,అదేంటి అసలు సినిమాలు చూడవా నువ్వు అంటే,నాది చాలా బిజీ లైఫు,పొద్దున లేసి బ్రేక్ ఫాస్ట్ చేసాక  ట్యుషనులు ఉంటాయి.తర్వాత పియానో లేస్సన్లు,తర్వాత ఫ్రెంచ్ నేర్చుకోవటం,ఇలా రోజంతా బిజీ.రాత్రి మా ఫ్యామిలీతో  టైం  స్పెండ్ చేసి ఇంక నిద్రపోతాను.అందుకే సినిమాలకి షికార్లకి టైం వుండదు అంటుంది.
అయ్యో.నేను ఇంకా నువ్వేదో ఖాళి అనుకున్నగా..ఇంత సీరియస్ టైపు అనుకోలేదు అంటాడు Noah.ఎం కాదు నాకూ ఫ్రీ టైం ఉంటుంది అంటుంది Allie.
ఇలా కబుర్లు చెప్పుకుంటూ రోడ్ మీద ఒక దగ్గరా గబుక్కున మన హీరో చేతులు చాపి పడుకుంటాడు.అదేంటి అని హీరోయిన్ అడిగితె,ఎంత హాయిగా ఉంటుందో ఇలా అన్నీ మర్చిపోయి రోడ్ మధ్యలో పడుకుంటే.మా నాన్న నేను చిన్నప్పుడు అలాగే చేసేవాళ్ళం అంటాడు.నీ వల్ల కాదు లే అని హీరోయిన్ ని ఉడికిస్తే,తను కూడా అలాగే వచ్చి పడుకుని..అవునూ..ఇప్పుడేదన్న ట్రక్కు ఇటు వస్తే ఎలా అంటుంది.ఏముంది మనం చస్తాం అంతే గా అంటాడు హీరో.మళ్ళి..కాదు లే..మన మనసుకి తెలుస్తుంది అంటాడు.కాసేపు అంతా మర్చిపోయి ఇద్దరు ఆ నిశ్శబ్దాన్ని ఆస్వాదిస్తూ ఉంటె సడన్ గా ఒక పెద్ద కారు వస్తది గాట్టిగా హరన్ మోగించుకుంటూ..ఇంక ఇద్దరు పరుగో పరుగు.చాలా సేపు పడీ పడీ నవ్వుతుంది Allie...
ఇంక అలా అలా ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అండ్ లవర్స్ అయిపోతారు.కలిసి బాగా ఊరంతా తిరుగుతారు.

ఇప్పుడు మళ్ళి ప్రెసెంట్ లోకి వచ్చేస్తాం.మన ముసలాయన కధ ఆపుతాడు లంచ్ టైం అయ్యింది అని.ముసలమ్మా అంటుంది,నేను చదివిన ఏ కధ ఇంత అద్భుతంగా లేదు.చాలా ఇంటరెస్టింగ్ గా వుంది,తొందరగా మిగతా కధ చెప్పండి అని.
లంచ్ చేసి తర్వాత చదువుకుందాం అని ముసలాయన లేసి వెళ్తాడు.

తీరికగా ఓపికగా చదివారుగా ఇప్పటిదాకా..చై గరం..చై గరం..టెక్ ఏ బ్రేక్..మిగతా కధ తర్వాత చెప్తా..

స్పాట్ పెడతా!

ఒక్కోరోజు జరిగే విషయాలు చూస్తుంటే,డౌట్ ఎ లేదు,ఈ రోజు పెద్దాయన మనకి స్పాట్ పెట్టినట్టున్నాడు అనిపిస్తుంది.అర్ధం కాలేదా?దేవుడు కూడా మనమీద అలిగాడేమో అని డౌట్ వస్తుంటుంది.ఇవాళ పొద్దున లేసిన దగ్గర నుండి అలాగే ఉంది మరి.ఎం చెప్పుకోను?పీతకష్టాలు పీతవి కదా.

అసలే పాకే జీవుల్లో పసిపిల్లు తప్ప మిగతావి అన్నీ నాలో జుగుప్స కలిగిస్తాయి.పొద్దున వంకాయలు కోద్దాం కూరకి అని నాలుగు వంకాయలు తీసా.వాటిల్లో రెండు పుచ్చులు.సరే పుచ్చు భాగం తో పాటు బాగానే ఉన్న భాగాన్ని కూడా కోసి అవతల పారేసి ఇంకాసిని వంకాయ్స్ తెచ్చుకుంటే అవి కూడా చా...లా పుచ్చులే.ఏదో తంటాలు పడి కూర ముగించాను అనుకో..

పని మనిషి అసలుకే డుమ్మా కొడతా అన్నది కాని..ఏదో వచ్చి రవ్వంత పని చేసి పోయింది.బట్టలు మెషిన్ లో వేద్దాం ఆని  వాషింగ్ మెషిన్ ఆన్ చేస్తే అది ఆన్ అవ్వదే!తీరా చుస్తే కరెంటు పోయింది.స్నానం కానిచ్చి చుస్తే కరెంటు వచ్చింది కదా అని బట్టలు మెషిన్ లో వేసి వచ్చానా...అందుకని పూజ ఐన తొందరగా చేద్దాం అనుకుని(ఇది అమ్మ ఆర్డరు.దేవుడిని పస్తు పెట్టకు అని) దేవుడికి నా కోరికల చిట్టా చదివి వినిపిస్తుంటే,పానకంలో పుడక లాగా ఫోన్ మ్రోగింది.వెళ్లి చుస్తే ఏదో పనికొచ్చే మనిషి చేసిన పనికిమాలిన ఫోను.

మళ్ళి పూజకి ఉపక్రమిస్తే భళ్ళున కిచెన్ లోకి వరద ప్రవాహం.తలుపు తీసి చుస్తే ఏముంది..వాషింగ్ మెషిన్ డ్రైయిన్ పైపు ఉంటుంది గా.అది కరెక్ట్ గా కిచెన్ లోకి వచ్చేట్టు పెట్టి వుంది..తొందరలో చేసిన పని మరి.నన్ను నేనే తిట్టుకుంటూ ఒక బకెట్ నీళ్ళు బట్ట తో పిండి పారపోసి,మళ్ళి పూజ మొదలెడితే హారతి ఆరిపోయింది:( మరి ఆరదా..మనం తిన్నగా పూజ చెయ్యకుండా మధ్యలో బ్రేకులు ఇస్తూ,జరిగిందంతా దేవుడి పొరపాటే అని కుసుకుంటూ పూజ చేస్తే అంతే మరి..లేదా కిచెన్ తలుపు తేసి ఉంది..పెద్ద గాలోచ్చింది అని మీనింగు.

ఏదోలే ఇంతటితో ఐపోయింది అనుకుని బట్టలు ఆరేశా..మంచి ఎండకి బట్టలన్నీ బాగా ఆరినట్టున్నాయ్ అని అనుకున్నానో లేదో..
పెద్ద వర్షం..బట్టలు మొత్తం తడిసిపోయాయి.అసలే బెడ్షీట్ లు కూడా ఉతికి ఆరేశా..సరేలే ..మళ్ళి ఎండ వస్తది..అవే ఆరతయ్యి.
కాకపొతే రోజు ఇంకా అయిపోలేదు.ముందు ఇంకేమన్నా చిలిపి పనులు లైన్ లో పెట్టాడా పెద్దసారు అని డౌటు.ఒక్కో రోజు ఒక్కో మనిషిని ఇలా టార్గెట్ చేస్తాడా మన సామి అని చిట్టి బుర్రలో చిన్ని అనుమానం.లేకపోతె గట్టిగ అరిసి ఎవరికీ చెప్పుకోలేని కస్టాలు కదా మరి...

మధురభావల సుమమాల

టీ.వీ అలా పెట్టానో లేదో,ఈ పాట..మధుర భావాల సుమమాల..మనసులో పూచే ఈ వేళ..
యెంత అందమైన భావం కదా.పాట తరువాత ఏముందో ఇంక ఎమీ వినపడలేదు..అలా వచ్చి ఈ రెండు ముక్కలు గుండెలో అతుక్కుపోయి మెల్లమెల్లగా కూనిరాగాలలా బయటకి వస్తున్నాయి.హాయిగా అనిపించింది ఎందుకో ఆ పాట వినగానే..పాట కాదు లే,ఆ రెండు లైన్లు వినగానే.

ఒక్కోసారి ఒక చిన్న పదం,ఒక చిన్న నవ్వు,ఒక చిన్న సువాసన,ఒక చిన్న రుచి,యెంత అద్భుతంగా మన మనసు స్థితిని మార్చేయ్యగలవో కదా..నాకు చాలా ఇష్టాలు వున్నాయి.కాని ఏ కారణం లేకుండా బాధగా వున్నప్పుడు ఆ ఇష్టాలు అక్కరకు రావు.ఒక జ్ఞాపకం,లేదా పసిపాప బుగ్గలు తలుచుకుంటే యెంత బాగుంటుందో.అసలు ఇప్పటిదాకా ఎందుకు బాధగా నీరసంగా ఉన్నామో కూడా అర్ధం కాదు..కదా? మనసుకు ఎడారిలో మృగతృష్ణ లాగా ఇలా హాయి గొలిపే ఇంకొన్ని నా ఇష్టాలు చెప్పనా..

బాగా భగభగ మండే ఎండలో నుండి ఇంట్లోకి రాగానే మూత పెట్టి లేని చల్లటి మంచినీళ్ళ సీసా.అదేంటో మూత తియ్యటానికి ఒక్క క్షణం కూడా పట్టదు.కాని మూత లేకుండా చల్ల చల్లని నీటి సీసా నోటికి తగలగానే అదో హాయి.
సర్వకాల సర్వావస్థల్లో పసిపిల్లల్ని తలచుకుంటే బాగుంటుంది.కాని నాకు వాళ్ళ చిట్టి చిట్టి పొట్టలు చూడటం ఇష్టం.ఎందుకో తెలీదు.వాళ్ళ పాలుగారే బుగ్గల నుండి ఒక రకమైన పసి వాసన వస్తుంది..అది కూడా ఇష్టమే.
ఏదో పద్యం వుంది కదా,చిన్ని కృష్ణుడు వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగాక ఆ బూరె బుగ్గల మీద పాల చారికలు ఇంకా పోలేదట.ఆ వాసన ఇంకా అలాగే వుండిపోయిందట...అలాంటి స్థితిలో బాల కృష్ణుడే కాదు,పిల్లలు అందరు దేవుళ్ళే.మన కోసం పాలు తాగుకుంటూ ఒక్క నవ్వు విసిరినా జన్మ ధాన్యమే..అన్నీ కోరికలు తీరిపోతాయి.

ఇంకా..తొలకరి చినుకుకి పులకరించి తన మేను నుండి సువాసన వెదజల్లే నేలతల్లి ఒక అద్భుతం.ఆ సువాసన దేనితో పోల్చాలంటే..తల్లిని బిడ్డని కలిపే ప్రేమ బంధం తో పోల్చచ్చేమో కదా..యెంత ఆస్వాదించినా ఇంకా తృప్తి కలగదు.నా ముక్కులు ఇంకాస్త పెద్దవి ఐతే ఇంకొంచం వాసన పీల్చేసేదాన్నే అనిపిస్తుంది :)
నాకు కావలసినప్పుడు వాన పడకపోయినా నేను చేస్కున్న ఏర్పాటు ఇంకొకటి వుంది.గోడ మీద కాసిని నీళ్ళు జల్లినా అదే సువాసన.అందుకే అప్పుడప్పుడు చేతిలో ఒక మగ్గు పట్టుకుని నేను మన గోడ దగ్గర సంచరించేది;)

అమ్మ కలిపి పెట్టె కొత్త ఆవకాయ మొదటి ముద్ద.అంటే,అది అమృతం.రెండో ముద్దకే పాతబడిపోతుంది.ఆ మొదటి ముద్ద అలా నోట్లో కరుగుతూ వుంటే ..ummmm..స్వర్గం :) గొట్టాలు అని పసుపు పచ్చ రంగులో ఉంటాయి కదా..అవి వేయించుకుని నముల్తూ ఒక్కదాన్నే మంచి అర్ధం కాని సినిమా చూడటం కూడా చాలా ఇష్టం :ప.ఇప్పుడంటే పెరుగన్నం నిషేదిన్చా కాని, చిన్నప్పుడు అన్నం లో నెయ్యి వేసి కలపనిచ్చి,అప్పుడు కురన్నం వద్దు,పెరుగన్నం కావాలి అని అడిగేదాన్ని.తిండి గురించి మొదలెడితే ఈ వ్యాసం కాస్త గ్రంధం అవుతుంది..ఇక్కడితో ఆపుతాను.

ఘంటసాల పాటలు.అందులో కొన్ని నాకోసమే పాడారు అనుకుంటే ఇంకా ఆనందం.ఆ పాటలే లేకపోతె నాకు ఊపిరాడదు.
నిద్ర లేవగానే ఏదో ఒక పాట మదిలో మెదుల్తుంది..ఆ పాట వెంటనే వింటే అదో ఆనందం.చూసావా..నాకు చాలా ఇష్టం అనుకునేవి ఈ క్షణం లో గుర్తురావట్లేదు.ఇప్పుడు ఇక్కడ రాసినవి మాత్రమె ఇష్టం అనుకుంటే పొరపాటేమో.ఇంకా చెప్పలేనన్ని ఇష్టాలు ..ఒక్కోసారి ఇష్టం లేదు అనుకునేది కూడా ఇష్టమే..ఎంటో మరి..

మళ్ళి ఆలోచించి ఇంకాసిని ఇష్టాలతో వస్తా..టాటా

3, డిసెంబర్ 2009, గురువారం

Dr.బుజ్జి - O.P

ఇవాళ పొద్దున నాన్నారు టీ లో చక్కర తక్కువ అయ్యింది అంటే,నా అవుట్ పేషెంట్ డిపార్టుమెంటు లో మొదటి  రోజులు  గుర్తొచ్చాయి.

నేను నా భయం బిడియం దాచేసి ధైర్యంగా కూర్చున్నా పేషెంట్ లని చూద్దాం అని.అప్పటికే పేషెంట్లు అందరు కొత్త సినిమా కి ఫస్ట్ డే ఫస్ట్ షో లాగా మా రూము బయట గుమిగూడి ఉన్నారు.అంత మందిని ఒక్కసారే చూసేసరికి నా గుండె కాస్తా జారిపోయింది. అయినా నటన ఏమాత్రం తగ్గించలేదు.మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ అలాగే కూర్చున్న.ఇంతలోకి ఆ గుంపు లో నుండి ఒక పెద్దాయన అందరిని తోసేస్కుంటూ లోపాలకి వచ్చాడు.

"అమ్మ డాక్టార్ అమ్మ,జల్ది నన్ను సూడు తల్లి.నీ కాల్ మొక్తా.ఆకుకూరల తట్ట కూడా బయటనే పెట్టచ్చినా.జల్ది సూడు తల్లి" అని మొదలెట్టాడు.మన ప్రతిభ ముందుగా ఈయన మీదే ప్రయోగిద్దాం అనుకుని,"ఎం తాతా, ఏమైయ్యింది..ఎందుకు కంగారు" అని అడిగా.
తాత  : "పోద్గాల్సంది ఒక్కటే నోస్తుంది "
బుజ్జి  : యెడ నోస్తుంది తాతా??
తాత  : ఇంటికాడ  నుండి  నోస్తుంది  బిడ్డా .
బుజ్జి  :  ?? ?? ?? ఇంటికాడ నుండి  సరే..నీకు యెడ నోస్తుంది ?
తాత  : కడ్పుల
బుజ్జి  : కడుపులో ఎక్కడ ??
తాత  : కడ్పులనే..మొత్తం
బుజ్జి  :(చేతితో సైగ చేసి) ఇక్కడా ? ఇక్కడా ??
తాత  :ఒక్క సోట అని ఎమ్ లేదు బిడ్డా ... మొత్తం నోస్తుంది .

అసలే నాకు కొత్త..పైగా నేను టెక్స్ట్ పుస్తకం లో చదువుకున్నట్టు కుడి ఎడమ అని చెప్పకుండా ఈ ముసలాయన మొత్తం అనే సరికి ఖంగు తిన్నాను.ఈయన జబ్బు ఏంటో నిర్ణయించుకోలేక మా చీఫ్ డాక్టర్ వచ్చేదాకా పెద్దాయన్ని మాటల్లో పెట్టేద్దాం అనుకున్నా.అందుకే ప్రశ్నల పరంపర కొనసాగిస్తూ..

బుజ్జి : తాతా, నీకేమన్నా షుగర్,బీ.పీ లాంటివి ఉన్నాయా ?
తాత : అంటే ఏంది?సక్కేర అనేనా నువ్వు  అడిగేటిదీ?
బుజ్జి : అవును
తాత : పెదోల్లం తల్లి.సక్కేర ఇప్పుడు ఐతే తేలే నేను.పొద్గాల చై లో ఐతే జరంత ఎస్కుని తాగ్తా.గా బీపి ఏందో తెల్వదు
బుజ్జి : అది కాదు ...చక్కెర రోగం ఎమన్నా ఉందా ?
తాత :ఏమో నాకెట్ల తెల్స్టది?రోగం ఉన్నదో లేదో నువ్వు జెప్పాలె తల్లి..
బుజ్జి :సరే లే...మరి రక్తపోటు ?
తాత : ఏందో నాకు ఒక్క కడుపు మాత్రమె నోస్తుంది... ఇంకేమేమో రోగాల్  అడ్గుతున్నవ్...దీనికి ఒక్క పచ్చ సూది ఇస్తే నే      పోత బిడ్డా...బయట ఆకుకూరల తట్ట పెట్టచ్చినా..గయి నల్లగయితయ్...ఇంక ఎవల్లు కొనరు... మా ముసల్ది  తిడ్తది.
బుజ్జి :పచ్చ సూది అంటున్నావ్? ఇంతక ముందు వచ్చావా ఇక్కడకి ?
తాత : నేను ప్రతి మంగ్లారం వస్తా తల్లి...నిన్నుకొత్తగ జూస్తున్న గాని...నేను ప్రత్తి మంగలారం అస్తా.
బుజ్జి : ??? నీకు పచ్చ సూది కాదు తాతా...మంచి మందులు రాసి ఇస్తాలే.కడుపు నొప్పికి మంచిగ పని చేస్తవి..
తాత  :అయ్యో వద్దు తల్లి..నాకు పచ్చ సూది రాసి ఇయ్యి.నేను జల్ది పోత..గీ నేప్పికి పచ్చ సూదే మందు.నువ్వు ఒక్క సంతకం చేసి పచ్చ సూది రాయి.నేన్ సేపించ్కుని ఇంటికి పోతా..

కాసేపు నిశ్శబ్దం..

అప్పటికే మా చీఫ్ డాక్టర్ వచ్చారు..నేను గాక ఒక గొప్ప అంతుపట్టని కేసు పట్టుకున్నాను అని ఆయన దగ్గరికి తీస్కుపోయాను ముసలాయన్ని.దూరం నుండి చూస్తూనే...కంటిన్యూ సేము ట్రీట్మెంట్ అని అరిసారు ఆయన.

అప్పుడు అడిగాను "ఎం తాతా..పాత చిట్టి ఏమన్నా వున్నదా"అని..జేబులో నుండి తీసాడు ఒక చినిగి సిదిలావస్థ లో ఉన్న కాగితం ముక్క.కొన్ని సంవత్సరాల క్రితం ఈయన నీరసం గా వుంది అని వస్తే బీ.కాంప్లెక్స్ ఇంజెక్షన్ రాసారు అట డాక్టర్లు.
అది వేయిన్చుకున్నాక ఈయనకి బోలెడు ఓపిక వచ్చేసిందట.ఇహ నక్షత్రకుడి లాగా ప్రతి వారం డాక్టర్ల వెంటపడి అదే సూది వెయ్యమని గోల.ఈయన బాధ పడలేక నెలకి ఒక సారి ఆ సూది వేసేయ్యమని నిరవధిక సూచన.కాని ఈ తాత మాత్రం ప్రతి వారం సూది కోసం ఆశగా వచ్చి పోతుంటాడు.

నాకు మాత్రం తప్పుతుందా..అసలే పాత రోగి వైద్యుడి కంటే బలవంతుడు అంటారు..అందుకే నేను కూడా మిగతా వాళ్ళ లాగా
CST రాసేసి పంపేసా..(continue same treatment).తాత ఆకుకూరల తట్ట తో ఇంటికి..బుజ్జి స్టేతోస్కోప్ తో వార్డ్ కి..
మిగతా సోది తర్వాత..తాతా..కాదు కాదు టాటా..

బుజ్జి - మల్లెచెట్టు

మొన్న వర్షం పడ్తుంటే అమ్మ చెప్పింది కాస్త మల్లెకి ఆకులు దుసి పొయ్యి,మళ్ళి ఆగష్టులో పూలు పుస్తాయ్ అని. ఆ పని చేశాలే...అప్పుడు గుర్తోచ్చింది...పోయినసారి మల్లెచెట్టు పుసినప్పుడు నాకు కవిత్వం తన్నుకొచ్చి ఒక పాత పుస్తకం లో రాసాను అని.అది ఇవాళ వెతికి పట్టుకుని ఇక్కడ ఎక్కిస్తున్న.పూర్తిగా సొంతామే..కాకపొతే కవిత్వం కాదు :)

ఆహ!స్వర్గానికి రెండే అడుగుల దూరం...ఈ అమోఘ సువాసన నాకు ఏదో తెలియని ఆనందాన్ని ఇస్తుంది అని మా మల్లెచెట్టు   పూలు విసిరే సువాసనను ఆస్వాదిస్తూ అనుకున్నాను.ఆ రెండు అడుగులు ఏంటో తెలుసా?కలల అలలపై తేలే మల్లెపువ్వు లాంటి మనసును ఆ స్వర్గానికి చేర్చే సుతిమెత్తని మెట్లు మా మల్లెపువ్వులే.వాటిని వొద్దికగా పేరిస్తే ఆ రెండు అడుగుల మెట్లు తయారవుతాయి.కాని వాటిని కోసుకుని ఆ మెట్లని చేసే మనసు రాదు.

పిల్లగాలికి హాయిగా తలలు ఊపుతూ పున్నమి రేయి తారలను ధిక్కరిస్తూ,మేము మీకన్నా బాగా మేరవటమే కాక సువాసన కుడా ఇస్తున్నమోచ్ అని ముసి ముసి నవ్వులు నవ్వుతు చెప్తాయి మా పూలు.పగటి ఎండ వేడిని కుడా నిశి తారలను ఎక్కిరించినట్టే ఎక్కిరించాబోయి వాడి,తలలు వాల్చి,జాలిగా మూగాబోతాయి.ఒక్క క్షణం లోనే ఆ నవ్వులు మాయం అవుతాయి.

రోజు ఈ జాలి చూపులు చూడలేక,వాటిని రాత్రి బాగా పొద్దుపోయాక,అవి వెన్నెల రాత్రిని బాగా అస్వదించాయి అని నిర్ధారించుకున్నాక,కోసి గుండెలనిండా వాటి సువాసన నింపుకుని..తాడు తో దండ కట్టలేక(మాకు రాక),సూదికి గుచ్చలనే ఆలోచనకే మనసు విలవిలలాడి,ఆ విడి పువ్వులనే దేవుని పాదాల చెంత వుంచి సంతోషిస్తుంటాం.

మొదటి పువ్వు పూసిన రోజు,మొదటగా మల్లె రాణి మా ముంగిటికే వచ్చింది అని సంతోషించాము. ఇది మల్లెల వేళ కాకపోయినా మా కోసమే మల్లె పూసింది అనుకున్నాము.పెరటి చెట్లన్ని ఈ మల్లె ముందు దిగదుడుపే అయ్యాయి.
రోజుకి లెక్ఖలేనన్ని పూలని ఇస్తున్న మల్లేని చూసి నేను ముందు చూసాను అంటే కాదు నేను అని పోటి పడి దాని ప్రభాత దర్శనం చేసుకున్నాం.మా మల్లె పూలు ఎన్ని రోజులు పూస్తే అన్నీ రోజులు మేము ఆ మల్లె చెట్టుకే దాసోహం.

కాని పది రోజుల తర్వాత నాలుగే పూలు పూసింది.ఆ రోజు కుడా దాని చుట్టూ ప్రదక్షిణాలు చేసాం.మరునాటి నుండి మల్లె ఉనికి చాటే సువాసన లేదు..మమ్మల్ని తట్టి లేపి ఆ చెట్టు దగ్గరకు తీసుకుపోయే సువాసన లేనేలేదు.ఇహ మొగ్గలు లేవని మనసుకి కుడా తెలిసిపోయిందేమో.. ..పాపం ఎదురు చూసి చూసి..తల వాల్చింది మల్లె...

మనం స్వర్ధపరులం. బాగా పుసినన్నాళ్ళు తన కోసం ఒక్క పువ్వు కుడా దాచుకోకుండా పిండి వెన్నెలలా మమ్ము ఆనందిమ్పచేసిన మల్లె ఇహ పూలు అయిపోగానే ఒక మామూలు మొక్క ఐపోయింది.మనసులో మల్లె తెచ్చిన భావుకతా లేదు..ఒక్కసారి ఆ పూలు లేని మల్లె చెట్టుని పలకరిద్దాం అనే ఆలోచనా లేదు.

మళ్ళి మల్లెలు పూస్తాయి..అప్పుడు మళ్ళి బిలబిల మంటూ మల్లె దగ్గరికి చేరిపోతాం..అప్పుడు ఏ మాత్రం సంకోచం లేకుండా మా మల్లె చెట్టు అనుకుంటూ ఆ సువసనలో తెలిపోతాం..
అంతే జీవితం...

బుజ్జి క్యాబేజీ పకోడీ

తెచ్చి రెండు వారాలు అయ్యింది ఆ క్యాబేజీ ని.. కూర చేస్తా అంటే చాలు నాన్నారు ఏదో ఒక సాకు చెప్పి మన్పిస్తున్నారు.పొద్దున కుడా అడిగా..మనం ఏదో స్నాక్స్ చేస్కుందాం అనుకున్నాం కదా దానితో అన్నారు :) సరే అని క్యాబేజీ పకోడీ చేసా సాయంత్రం. ఇంతక ముందు ఒకసారి ప్రయత్నిస్తే వాటికి పేరు మార్చి పెట్టాల్సి వచ్చింది..నూనె బజ్జి అని..తేడా ఎక్కడ జరిగిందో కాని,బాగా నూనె పీల్చి మెత్తగా వుడకకుండా వచ్చాయి.

అందుకే ముందు జాగ్రత్త కోసం నెట్ లో వెతికి నా తెలివితేటలు కాసిని జోడించి చేశా ఇవాళ.అద్భుతంగా వచ్చాయి:) నాన్నారు కుడా బాగున్నాయ్ అన్నారు.ఇంక  రెసిపీ  చెప్తాలే ...

ఒక చిన్న క్యాబేజీ---కూరకి కోసినట్టే  సన్నగానే కొశా..ముక్కలు రెండున్నర కటోరీలు అయ్యాయి.
ఒక ఉల్లిపాయ--- ఇది కుడా సన్నగా చిన్నముక్కలు కోసాను..
సెనగపిండి--- రెండు కటోరీలు,
బియ్యప్పిండి--- ఒక్క కటోరీ
(ఈ దెబ్బతో ఇంట్లో ఉన్న సెనగపిండి అయిపోయిన్దోచ్)
ఇంక అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి,జీలకర్ర mixie లో పేస్టు చేసి పెట్టుకున్నాను. ఇంక చాలా కొద్దిగా నీళ్ళు పోసి
(చాలా అంటే నిజంగా చాలా కొద్ది,లేకపోతె కరకరలాడవు అని చదివా)
ఈ పిండీస్ అండ్ ముక్కాస్ మొత్తం కలిపేసి కాస్త ఉప్పు,మసాలాపొడి,అదేలే గరం మసాలా...అండ్ కరేపాకు(కరివేపాకు) వేసి బాగా కలిపి,నూనె లో వేయించాను.
బాగున్నాయ్ అని ముందే చెప్పాగా :)
ఇంక ఈ పూటకి వంట అక్కర్లేదు...ఇవి తినేసి ఫుల్ గా వుంది.నాన్నారు కాస్త పెరుగన్నం తింటారేమో... నేను ఆకలేస్తె ఇంకాసిని ఇవే నమిలేస్తా :))

Dr.బుజ్జి - బీ.పీ

ఎక్కడో ఒక చోట మొదలు పెట్టాలి కదా. టాపిక్ ఐతే ఇంకా మెమరీ లో ఫ్రెష్ గా వుంది.అందుకే ఇక్కడనుండి మొదలు పెట్టాను.అసలు mbbs ఐపోయిన తరవాత ట్రైనింగ్ కి హౌస్ సర్జేన్సి అని మన ఆంధ్రులు ఎందుకు  నామకరణం చేసారో తెలీదు కాని ఆ పేరుకి, చేసే పనికి అస్సలు పోలికే వుండదు అని మాత్రం స్వీయానుభవం. 


మొదటి రోజు అడుగుపెట్టాను మెడిసిన్ వార్డ్ లో.చక్కగా తొమ్మిదింటికి ఒక అరగంట ముందే వెళ్లి అంతా కలయ తిరిగి  గబగబా కేసు షీట్లు చదివేశా.మనని ఎవరన్న వచ్చి ఒక రెండు ముక్కలు అడుగుతారేమో పేషెంట్ల  గురించి. ఇమ్ప్రేషన్   కొట్టేద్దాం అని.


తొమ్మిదిన్నరకి వచ్చింది మనకంటే కాస్త పెద్ద డాక్టరమ్మ."అబ్బా వచ్చేశారా కొత్త బ్యాచ్. మళ్ళి మీకూ ట్రైనింగ్ ఇస్తూ   కూర్చోవటానికి నాకేం పని లేదా.జాగ్రత్తగా పనులన్నీ మీ కొలీగ్సని అడిగి నేర్చుకోండి, నన్ను చికాకు  పట్టకండి" అని చెప్పింది.ఏదో పెద్ద పనులు చెప్తుందేమో అని ఆశగా ఒక రెండు నిముషాలు ఆవిడ మొహనికేసి  చూశా.ఇంకో అర సెకండు అలాగే చుస్తే రెస్త్రైనింగ్ ఆర్డర్ తెస్తా అన్నట్టు చూసింది.తల వాల్చుకున్నాను.


ఎన్నింటికి వచ్చావ్ అని అడిగింది. 8:30 అని చెప్పానా..ఇంక మొదలయ్యింది క్లాసు.ఏం చేస్తున్నావ్ మరి  ఇంతసేపటి నుండీ? ఒక్క కేసు షీటులో కూడా B.P రికార్డు చేసి లేదేంటి? అందుకే చెప్పాను మీ ఫ్రెండ్స్ ని అడిగి త్వరగా పనులు నేర్చుకోమని..అని ఇంకా ఏదేదో అన్నది లెండి.ఇంక పరుగు పరుగున పోయి నా వైపు జాలిగా చూస్తున్న ఒక పాప ని B.P యాపరేటస్సు ఏది అని అడిగా.ఇంతకి పాప అంటే మీకు తెలీదేమో... పెద్ద నర్సులు ట్రైనీ నర్సులని పాప అని పిలుస్తారు.i knows.వినటానికి కాస్త దరిద్రంగానే వుంది.

సో మన పాప "తెలీదు డాక్టర్,సిస్టర్ ని అడగండి"అని ఉచిత సలహా పడేసింది.మొత్తం వార్డ్ వెతికినా B.P చూసే పరికరం కనపడలేదు.పక్క వార్డ్ కి పోయి అడిగితె మాకు కావలి,ఇవ్వటం కుదరదు అని ఖరకండిగా చెప్పేశారు. ఇంక చేసేది ఏముంటుంది.ఆ పక్క వార్డ్ లో ఎవరు చూడకుండా ఎత్తుకొచ్చేసా...అని నేను అనుకున్నా. ఎవరుచుడకపోవటానికి  అదేం బజ్జి  ముక్క కాదు కదా. ఒక పెద్ద ఇనప స్టాండ్ కి అతికించిన B.P మిసను మరి! పైగా దాని మీద వార్డ్ నెంబర్ కూడా వుంది.ఈ విషయం నన్ను తరుముకుంటూ వస్తున్నా మా బ్యాచ్ మేట్ ని చూసి తెలుసుకున్నాను.తీరా దానిమీద వార్డ్ నెంబర్ చుస్తే అది మాదే!! అద్భుతాలు అలా జరిగిపోతుంటాయి.


ఇంక మొదలు పెట్టాను B.P చూడటం.ఒక్కో పేషెంట్ బెడ్ దగ్గరకి ఆ స్టాండ్ ని మోసుకుంటూ పోయి B.P చూద్దాం అని ప్లాను.మొదటి పేషెంట్ కి కఫ్ చుట్టి పుంపు కొడ్తుంటే ఒక్క మిల్లిమీటరు కూడా పైకి పోదే ఆ కాలమ్.నా ఖర్మ అలా కాలితే ఎవరు మాత్రం ఎం చేస్తారు.దానికి బొక్క వుందట.మరి బాగు చేయించి నాకు వేరేది ఇవ్వు అని సిస్టర్ ని అడిగితె,రోజు  B.P చూసేది నువ్వు ఐతే నేను ఎందుకు వెతకాలి నీకోసం ఇంకో B.P పరికరం అని గొడవకి దిగింది.ఇంక నోటికి ఒక ప్లాస్టర్ వేసుకుని మన పని మనమే చేసుకోవాలి అనే సిద్ధాంతాన్ని నమ్మి, కబోర్డ్ లో  కఫ్ పనిచెయ్యకుండా వొంటరిగా వున్నా పంప్ ని తెచ్చి ఈ రెండిటికి జత కట్టి నా పని లో నేను పడ్డాను.

అప్పటికే పదిన్నర.
హెడ్ అఫ్ ది డిపార్టుమెంటు రౌండ్స్ కి వస్తున్నారు అనేసరికి అందరం తీవ్రంగా పని చేస్తున్నట్టు నటించేస్తున్నం. ఆవిడ రానే వచ్చింది.B.P రికార్డు చేసిలేని కేసు షీట్లు చూడనే చూసింది.ప్రేమగా దగ్గరకి పిలిచి మీ PG ని పిలువు అన్నది.బిక్కుబిక్కు మనుకుంటున్న నన్ను వదిలేసి పాపం ఆ PG ని ఘాటుగా నాలుగు తిట్లు తిట్టి పోయింది.

ఆవిడ వెళ్ళిపోయాక B.P లు చూసేసి కేసు షీట్ లో రాయబోతుంటే కెవ్వు మని కేక. ఏంటా అని వెనక్కి  తిరిగితే క్లాసు పీకిన PG. నిన్ను కేసు షీట్ లో B.P ఎవరు రాయమన్నారు.ఒక చిన్న కాయితం మీద రాసి ఇస్తే చాలు, నేను నా చేతి రాత తో కేసు షీట్లో రాసుకుంటాను అని...అందుకని మరుసటి రోజు నుండి జేబులో ఒక రెండు చిట్టి కాయితాలు కూడా పట్టుకెళ్ళటం అలవాటు చేసుకున్నాను.B.P ఆ పేపర్ మీద రాసిఇస్తే ఆవిడ కేసు షీట్లో నోట్ చేసుకున్నేది.

ఈ గొప్ప అనుభవం తో గయనకాలజీ వార్డ్ లో వేసినప్పుడు వోసోస్స్స్ మాకు B.P చూడటం కొట్టిన పిండి. ఇక్కడ అంతా బహు వీజీ అనుకున్నా.హతవిధీ...ఇక్కడ PG కాయితం కూడా అనవసరం, పేషెంట్ చేతిమీద రికార్డు చెయ్యండి అని ఆర్డర్ వేసారు.ఈ సిస్టం కనిపెట్టిన వాళ్ళకి ఒక పెద్.....ద్ద ఇంజేక్షోన్ ఇవ్వాలి అనిపించింది వినగానే...

వార్డ్ మొత్తం తిరిగి అందరికి B.ప చూసి వాళ్ళ చేతుల మీద రాసేసి అలా కూర్చున్నాను కాసేపు. మ్యడం గారు దయచేసారు.రెండు బెడ్లు దాటారో లేదో,నావైపు సీరియస్ గా చూసి,నీకేమన్నా ప్రత్యేకమైన కారణo ఉందా కొందరికే B.P చూడటానికి అని అడిగారు.అలాంటిది ఎం లేదని యెంతో అమాయకంగా చెప్పా. బట్ నో యుజు... మనం B.P చూసాక కాండిడేట్ బాత్రూంకి వెళ్ళిందట.చేతులు సుబ్బరంగా కడిగేస్కుని వచ్చి కూర్చుంది నంగనాచి. హతవిధీ... ఎం చేస్తాం.మా మ్యడం  నోటినుండి రాలిన తిట్ల ముత్యాలు ఏరుకుని జేబులో పోసుకోవటం తప్ప. పోనీ సాక్ష్యం కోసం ఆ పేషెంట్నే"ఎమ్మా...నీకు నేను B.P చూడలేదా" అంటే చాలా మాములుగా తల అడ్డంగా నిలువుగా కాకుండా గుండ్రంగా తిప్పింది.


మా వార్డ్ కి సంబంధించి అవుట్ పేషెంట్ డే, వారం లో రెండు రోజులు వుంటుంది. ఇహ ఆ రోజు వస్తారు  మాత్రుమూర్తులు ఒక వేల్లువలాగా.మనకి ఒక బల్లా కుర్చీ వేసి కుర్చోపెడ్తారు.పోస్ట్ మాస్టారు గనక ఉత్తరాల మీద స్టాంపు వేసినంత స్పీడు గా B.P చూడాలి.ఒక వంద మంది తో ఆగితే మన అదృష్టం.

రాసుకుంటూ పొతే B.P మీదే చెరిత్ర రాయొచ్చు.కాని ప్రస్తుతానికి ఇంతే... మళ్ళి బుర్ర గోక్కుని రాయాలనే దురద  పుట్టగానే ప్రత్యక్షం అవుతా... టాటా టిల్ దెన్  :)