25, జనవరి 2010, సోమవారం

కొంచం imagination ఉండాలమ్మ..

ఇవాళ నాకు నేనే పెద్దరికం ఆపాదించుకుని,కొన్ని పెద్ద విషయాలు చెప్పేద్దాం అనుకుంటున్నా.అంటే చిన్నపిల్లల  కళ్ళు మూసి పెద్దవాళ్ళు చెవులు ముసేస్కునే అంత విషయాలు కాదులే.టీవీలో వచ్చే ఇంగ్లీష్ సినిమా ముందు viewer discretion is required అన్నట్టు,ఏదో...ఆచి తూచి ఆలోచించి చదవండి.ఇలా ఛిన్నమెదడు చితికినట్టు పెద్ద ఉపోద్ఘాతం ఎందుకిచ్చానో  అర్ధం కావట్లేదా?ఎం చెయ్యను చెప్పండి..Frankfurt విమానాశ్రయంలో ఉన్నా.మరో ఆరు గంటలు ఐపుండదు మన ఇమానం. అందుకే,ఈలోపు సమయాన్ని సద్వినియోగ పరుద్దాం అని ఈ ప్రక్రియ మొదలెట్టా.


విషయం  ఏంటంటే..నాకు ఊహాశక్తి ఎక్కువ.ఏదన్న జోక్ చెప్పినా,విన్నా,నేను ఆ సందర్భాన్ని ఊహించుకుని భీబత్సంగా  దృశ్యరూపంలో చూసేసి మరీ నవ్వుకుంటా.ఈ మధ్య మరీ పైత్యం ప్రకోపించి,నాకు హస్యాద్రుస్టం కూడా ఎక్కువయ్యి,ఇట్టాంటి  సందర్భాలు చాలా ఎక్కువగానే తగుల్తున్నాయ్.డాక్టర్లని జోకులు చెప్పమని అడగకూడదు.అడిగితె,వాళ్ళు ఆపమనేదాక నవ్వటం ఆపకూడదు.లేకపోతె paracetamol లో ఏ పసరు మందో కలిపేసి ఇస్తే...అదంతే...ఇస్తే గిస్తే ఎం లెదు... నవ్వు ఆపకూడదు అంతే.

నేను మొన్నామధ్య ఒక ల్యాబ్ లో చేరా.ఎందుకు ఏమిటి ఎలా,దానివల్ల నీకు లాభం ఏంటి,నువ్వసలు డాక్టర్వేనా లాంటి ప్రశ్నలు మీరు అడక్కూడదు,నేను చెప్పకూడదు.సరే అడగచ్చులే.ఐనా నేన్ చెప్పానుగా..సరే చెప్తాలే..ఐనా మీకు అర్ధం కాదుగా.. సరే,సోది ఎందుకుకానీ,ఎలకల మీద ప్రయోగాలు చేస్తారక్కడ.ఇక్కడ కొంత హింస,హత్యలు,పంచ మహాపాతకాలు,పెద్దవారికి మాత్రమె లాంటి టైటిల్స్ పడతాయి..జాగ్రత్త.ఆ ఎలకలు మాములువి కాదు కాబట్టి,కడుపుతో ఉన్న అమాయక ప్రాణులు కాబట్టి, రెండు నిమషాలు ప్రాణికోటి కోసం ఆహుతి ఐన వాటి అమర జీవితాలకి సంతాపం తెలిపి మరీ నా కధ మొదలుపేడ్తున్న...


మా ల్యాబ్ లో ఎలకల బాగోగులు చూస్కోటానికి ఒక మనిషి ఉంటాడు..పాపం చదివింది మంచి చదువేలే.. కాకపొతే తనపని తో  పాటు ఈ పని కూడా చేస్తాడు...మనకా ల్యాబ్ లతో పెద్ద touch లేదాయే..రేపు మనం చెయ్యాల్సిన కార్యక్రమాలు ఎంటండి... ఏమన్నా ఎలకలు ఉంటయ్యా కొయ్యటానికి అని అడిగేసా.పైకెళ్ళి చూసొచ్చాను,ఎలకలు యెవీ నాకు గర్భిణులుగా  కనపడలేదు అన్నాడు! (none of them LOOKED ______ to me అన్నాడు )
ఏంటీ!!! చూసి చెప్పేస్తావా !! ఛా..నిజమా!! అని కాసేపు ఆ మానవుడి వైపు అదో expressionతో చూసా.అతను  చేప్పదల్చుకున్నదే నేను విన్నానా,లేక అసలే తింగర బుచ్చిని,నాకు ఇంకేదో అర్ధమయ్యిందా అని కాసేపు సంసయించా... అక్కినేనివారి సినిమాలో మాత్రమె..నాడి పట్టుకు చూసి...congratulations..మీరు  dash dash కాబోతున్నారు అని చెప్తారు అనుకుంటే,వీడేంటిరా బాబు..ఇలా...అసలు ఎలకేంటి,దానికి కడుపేంటి,వీడు చూసి చెప్పటం ఏంటి,అని ఇంకో expression.   మరీ ఎక్కువగా అడిగితె అసలే ఫ్రీ కంట్రీ.సృష్టి రహస్యాలు చెప్తాడని భయమేసి..నోర్ముస్కున్న...


రెండ్రోజులు ఇది జోక్ ఆ లేక నాకు అంతుపట్టని ప్రస్నో కూడా అర్ధం కాల.ఉండబట్టలేక,ఒకపెద్దావిడని చూస్కుని,మెల్లిగా  గోటితో నేలకేసి రాస్తూ,కాస్తంత  సిగ్గుపడుతూ,ఆ మానవుడు ఎలా  కనిపెడతాడు చెప్పవా అని బతిమాలా.నేను అరగంట బ్రతిమాల్తే,ఒక్క క్షణం లో చెప్పేసింది..చూసి  అని!
నిజమే ...తర్వాత నేను కూడా చుసెసాగా ఎలా చూసి చెప్తాడో! మీకు వివరాలు అనవసరం.నాకు అర్ధం అయి చస్తే కదా మీకు చెప్పేది! :P


ఆ మానవుడికే భారత దేశం లో పిడకలతో వంట చేస్తారు అని చెప్తే,ఏంటి..అది తింటారా అని అడిగాడు..misunderstandingu ఎంత ఘోరంగా ఉంటుందో అర్ధం అయ్యిందిగా.అతని imagination అలా తగలడింది మరి.గంటసేపు నిల్చోపెట్టి,ఆవు విసిస్టత,పిడక అంటే ఏంటి,గోడ మీదకి ఎలా వెళ్తుంది,ఆవు ఎందుకు మాత,ఎద్దు ఎందుకు పిత కాదు..ఇత్యాది చెప్పి..పిడక బెస్ట్ bio fuel అని ఒప్పించా.


కొత్తగా ల్యాబ్ లో చేరిన రెండ్రోజులకి న్యూఇయర్ అని,పెద్దావిడకి గిఫ్టు కొన్నాము...నీ పేరు కూడా చేరుస్తాము లే బుజ్జి అన్నారు మా వాళ్ళు. ఉత్తినే ఎందుకులే,నా వాటా కూడా ఇస్తా కానీ,ఇంతకి ఎం తెచ్చారు అని అడిగా.సెంటు సీసా కొన్నాము ఎనభై డాల్లర్లు పెట్టి అన్నారు.సరే అందరం ఛిన్న సీసా పెద్దావిడ డెస్క్ మీద అపురూపంగా పెట్టాం. ఈవిడ ఆత్రం తగలెయ్య.అసలే తడిసిన పిల్లి కంపు కొడ్తున్ననేమో(ఊహించు ఊహించు..)ఇప్పుడే పుసేస్కుంట అని బాటిల్ సగం ఓంపెస్కుంది.వాసన బాగున్నట్టు ఉంది.వెంటనే నలభై తుమ్మింది...తుమ్ములు...మరీ డాల్లర్ కి ఒకటైన గిట్టుబాటు కావాలి కదా.


సరేగాని ఇంకో imagination...ఫ్లైట్ లో ఆకలి వేస్తె నమలటానికి మొన్న కొన్నbrownies తీస్కెళ్ళేదా అని అడిగా ఇంట్లో.
విమానాశ్రయంలో..ఒక చేతిలో మిఠాయి పొట్లం, మరో చేత్తో నోటినిండా అప్పచ్చేలు కుక్కుకుంటూ..ఆఫీసర్ ఎమన్నా food items ఉన్నాయా అని అడిగితె, ఎం లేవ్ అని విసురుగా సమాధానం చెప్పెయ్యమని మా cousin సలహా పడేసింది.ఆ సీన్ లో నన్ను నేను ఊహించుకుని...ఇంకా చెప్పాలా..పొట్ట చెక్కలయ్యేలా చాలా సేపు నవ్వుకున్న.ఇంతకి తొందరలో అప్పచ్చలు తెచ్చుకోల.ఉడకేసిన పాలకూర,ఉడకని అన్నం,సగం ఉడికిన సెనగలు పడేసారు నా మొహాన ఫ్లైట్ లో.హిందూ భోజనం ఆర్డర్ చేసారు కాబట్టి, మేము ఇవాళ వండిన చికెన్ తినే అదృష్టం మీకు లెదు అని చెప్పి...నాకాపట్టింపు లేదమ్మాయి అని నేను మొత్తుకున్నా వినకుండా చేతిలో డబ్బా లాగేస్కుని మరీ ఆ గడ్డి పెట్టింది నాకు గాలి పిల్ల(ఎయిర్ హోస్తేస్స్).
ఏ కుక్కనో ఎద్దునో కోసి పెడతారేమో అని అతి జాగ్రత్తగా మన భోజనం అడిగితె,పచ్చి పాలకురే గతి.


మొన్న ఒక రోజూ మాటల సందర్భం లో..నువ్వు ఇండియా వచ్చేయి అక్కా..ఇక్కడ ఆస్పత్రి పెట్టిద్దాం అని ఒక తమ్ముడు తెగ ఆవేసపడ్డాడు.(ఆ ఆ నువ్వే..నీ సంగతే చెప్తున్నా...క్షమించరా....ఇది చెప్పకుంటే నీ మేధాశక్తి మరుగున పడిపోతుంది..నీ పేరు మాత్రం చెప్పాను అని మాటిస్తున్నాను రా సుబ్బారావు).సరే అంతగా ఆవేసపడకురా.నేను వచ్చి మాత్రం చేసేది ఏముంది.. జనాభా తగ్గించటమే కదా అన్నాను.ప్రాస కోసం అన్నాడో లేక బుర్ర ఇంటిదగ్గర పెట్టి వచ్చాడో కానీ..నువ్వు తగ్గిస్తే నేను జనాభా పెంచుతాగా అన్నాడు.
ding!! !!! మీకేమన్నా అర్ధం అయ్యిందా? i think whatoooooo whatuuuu...మీ ఆవిడకి చెప్పవా లేదా నీకు ఇలా జనాభా పెంచే ఉద్దేశం ఉన్నట్టు అని కూడా అడిగా.పాపం బాగా ఆలోచించాక కానీ తను అన్నమాటకి పూర్తీ అర్ధం వెలిగినట్టు లెదు మా వాడికి. ఇంక ఆరు నెలలుగా నేను అదే నవ్వు కంటిన్యూ చేస్తున్నా.థాంక్స్ రా సుబ్బి..ప్రపంచానికి ఒక కొత్త వాక్యం పరిచయం చేసావ్ :P


మా వాడొకడు మోనాలిసాలా ఆ నవ్వేంటి అంటుంటాడు.సరేగాని,మోనాలిసా expression లో యేమి రహస్యం ఉందని జనం వెర్రెత్తి పోతుంటారు అని నన్నే అడిగాడు డౌటు.హహ అడగాలే కానీ,మన దాగ్గర ప్రతిదానికి ఒక సమాధానం ఉంటుంది.ఒరేయ్ పిచ్చి నాగన్న...ఆవిడ అలాంటి expression ఇచ్చింది అంటే..ఎదురుగ్గా బొమ్మేస్తున్నాయన ఫేసు ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి  ఊహించు అన్నాను..పైగా..కదలకుండా అన్నేసి గంటలు అలాంటి ముసలాడి ఎదురుగ్గా కూర్చుంటే మొనానే కాదురా..నువ్వూ అదే expression ఇస్తావ్  అన్నా..వాడి expression లో ఏదో మార్పొచ్చింది ఈ మధ్య.నా వైపు ఆరాధనా భావం తో చూస్తున్నాడు, నా తెలివితేటలకి అబ్బురపడి!:P


మొత్తానికి గంట గడిపేసా ఈ పిచ్చి రాతలతో.ఎదురుగ్గా కూర్చున్న తెల్లాయన నేను ఇంత సీరియస్ గా కామెడీ చేస్తున్నా అంటే నమ్మలెడులే.అర్జెంటు పని ఏదో చేసుకుంటున్న అమాయక ప్రాణిని అనుకుంటున్నాడు.ల్యపు టాపులో ఛార్జ్ అయిపోతుంది.ఆ లోపు మరో టపా మొదలు పెడ్తాగా.టాటా టిల్ దెన్.

3 కామెంట్‌లు:

  1. ఇన్ని నవ్వాలోచనలు చేస్తూ సీరియస్ గా ఉన్నట్లు ఆ తెల్లాయనను నమ్మించేసారంటే, మీకు దూరదర్శన్లో (దుర దర్శనం అన్నా పర్లేదులెండి) ఉద్యోగం గేరంటీ !

    రిప్లయితొలగించండి
  2. జ్యోత్స్నగారు మీలో ఇంత గొప్ప కవయిత్రి ఉందా... ఇలానే మంచి హాస్యపు జల్లుల్ని మామీద కురిపిస్తూ ఉండండి.త్వరలో కొన్ని మంచివి ఏరి ఒక పుస్తకంగా ప్రచురిద్దాం.

    రిప్లయితొలగించండి
  3. ఆ మానవుడు మరి మన బ్రహ్మానందం style లో "ఆవు గోడ మీదకెక్కి పిడకలు ఎలా వేస్తుంది " అని అడగలేదు గా :)

    hmmm విమాన ప్రయాణాలు ఎంటో గాల్లో పచ్చి పాలకూర కట్ట కర కర నవలడం ఎంటో ... పాపం బుజ్జి కష్టాలు బుజ్జి వె :P

    హహహః మీ తమ్ములం " జనాబా పెంచే " అవిడియా అమోఘం :P కానీ పాపం వల్లవిడే ఈ యొక్క BILLu పార్లమెంటు లో మొన్నామధ్య మహిళా బిల్లు మాదిరిగా ఆమోదిస్తున్దంటావా :P హహహః

    సరే తాపాలు రాయడం ఉండాలే కానీ మాలాంటి మహానుబావులు చదవడానికి commentlu రాయడానికి తక్కువ చెప్పు :)




    hmmm unna gantalo kooda ATU ITU choodakunda Buddiga laptop lo choostu tapalu adhi serious ga raskuntunnav ante hmmm memory power bagane undi
    :)

    kani nadhi oka doubt
    ah manavudu
    "avu goda ekki yela pidakalewsindabba" ani adagaledhu kada :P
    heheheheh
    chetragupta
    eh bujji samadanam cheppaka pothe nuvve cheppali :P

    రిప్లయితొలగించండి